Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

సీఈసీ రాజీనామా చేయాలి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సీఈసీ రాజీనామా చేయాలి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

వార్త ముఖ్యాంశాలు

  • జ్ఞానేశ్ కుమార్ తీరుపై కాంగ్రెస్ నేతల తీవ్ర నిరసన – దిష్టిబొమ్మ దహనం నిర్మల్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ…
  • ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమాండ్ అలీ పాల్గొన్నారు.
  • కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు.

జ్ఞానేశ్ కుమార్ తీరుపై కాంగ్రెస్ నేతల తీవ్ర నిరసన – దిష్టిబొమ్మ దహనం
నిర్మల్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమాండ్ అలీ పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
తదుపరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న కాంగ్రెస్ నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై తమ అభ్యంతరాలను వివరిస్తూ, ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం నిలిచేలా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలని వారు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *