Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సూర్యాపేట

రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు చేయొద్దు..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు చేయొద్దు..

సూర్యాపేట పట్టణంలో ఆపరేషన్ రోప్ ROPE – Removal of Obstructive Parking and Encroachments. స్పెషల్ డ్రైవ్.

జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణంలో ప్రజల, వాహనదారుల సౌకర్యార్థం సూర్యాపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి “ఆపరేషన్ రోప్” కార్యక్రమం చేపట్టడం జరిగినదని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం అన్నారు. దీనిలో భాగంగా ఈరోజు కుడ కుడ రోడ్డు లో ఉన్న ఆక్రమణలను మున్సిపాలిటీ అధికారులతో కలిసి తొలగించారు. అలాగే రోడ్డు పై ఉన్న మట్టి కుప్పలు, చెత్తను, రాళ్ళను తొలగించి రోడ్డు సక్రమంగా కనిపించేలా వినియోగించేలా చేశారు. ముఖ్య పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి, ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా, ప్రమాదాలు జరగకుండా చేయడం, ఆక్రమణలు, అనధికారిక పార్కింగ్ తొలగించడం, వాహనాలు క్రమపద్ధతిలో వెళ్లడం అరైవ్ అలైవ్, రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో ఆపరేషన్ రోప్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు.

రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు చేయొద్దు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *