Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాజోలు ఎంపీడీవో కార్యాలయం జలదిగ్బంధంలో

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రాజోలు ఎంపీడీవో కార్యాలయం జలదిగ్బంధంలో

వార్త ముఖ్యాంశాలు

  • రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాజోలు ఎంపీడీవో కార్యాలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది.
  • సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో కార్యాలయ ప్రాంగణం మొత్తం నీటితో నిండిపోయింది.
  • ప్రధాన ద్వారం నుంచి కార్యాలయంలోకి వెళ్లే మార్గం సైతం నీటమునిగింది.

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాజోలు ఎంపీడీవో కార్యాలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో కార్యాలయ ప్రాంగణం మొత్తం నీటితో నిండిపోయింది. ప్రధాన ద్వారం నుంచి కార్యాలయంలోకి వెళ్లే మార్గం సైతం నీటమునిగింది. దీంతో అధికారులు, సిబ్బంది, వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయ పరిసరాల్లో నీరు నిలిచిపోవడంతో దోమలు, దుర్వాసన సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నీటిని తొలగించి, శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను స్థానికులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *