Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

బిన్ బ్యాగ్ వినియోగంపై అవగాహన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బిన్ బ్యాగ్ వినియోగంపై అవగాహన

పున్నమి ప్రతినిధి (సెప్టెంబర్ 25)
వేముల మండలం, సెప్టెంబర్ 25: వేముల గ్రామ పంచాయతీ పరిధిలో బిన్ బ్యాగ్ వినియోగం, చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటి పరిసరాల్లో చెత్తను విచ్చలవిడిగా వేయకుండా తడి, పొడి చెత్తను వేరు చేసి బిన్ బ్యాగ్‌లను సక్రమంగా వినియోగించాలని సూచించారు. బిన్ బ్యాగ్‌ల వినియోగంతో గ్రామ పరిశుభ్రత మెరుగుపడటంతో పాటు పారిశుధ్య నిర్వహణ మరింత సమర్థవంతంగా చేపట్టవచ్చని వివరించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తమ వంతు సహకారం అందిస్తామని ప్రజలు తెలిపారు. కార్యక్రమంలో డీవై ఎంపీడీఓ, పీడీఓలు, ప్రజలు పాల్గొన్నారు.

బిన్ బ్యాగ్ వినియోగంపై అవగాహన

బిన్ బ్యాగ్ వినియోగంపై అవగాహన

బిన్ బ్యాగ్ వినియోగంపై అవగాహన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *