Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

బీసీ సాధికారిక సంఘం ముస్తాబాద్ యూత్ మండల అధ్యక్షుడిగా మామిండ్ల స్వామి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బీసీ సాధికారిక సంఘం ముస్తాబాద్ యూత్ మండల అధ్యక్షుడిగా మామిండ్ల స్వామి

వార్త ముఖ్యాంశాలు

  • ముస్తాబాద్: పున్నమి ప్రతినిధి 06/07/2026 బీసీ సాధికారిక సంఘం ముస్తాబాద్ యూత్ మండల అధ్యక్షుడిగా మామిండ్ల స్వామి గారిని బీసీ సంఘం స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగని మనోహర్ గారు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుద్దాల దేవయ్య గారు నియమించారు.
  • ఈ సందర్భంగా మెంగని మనోహర్ గారు మాట్లాడుతూ, బీసీలకు ఇచ్చిన హామీల అమలు, 42 శాతం రిజర్వేషన్ సాధన వరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీసీలను ఐక్యం చేస్తూ హక్కుల కోసం ఉద్యమం కొనసాగిస్తామని అన్నారు.
  • బడ్జెట్‌లో బీసీలకు రావాల్సిన నిధులను పూర్తిస్థాయిలో కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ముస్తాబాద్: పున్నమి ప్రతినిధి
06/07/2026
బీసీ సాధికారిక సంఘం ముస్తాబాద్ యూత్ మండల అధ్యక్షుడిగా మామిండ్ల స్వామి గారిని బీసీ సంఘం స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగని మనోహర్ గారు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుద్దాల దేవయ్య గారు నియమించారు.
ఈ సందర్భంగా మెంగని మనోహర్ గారు మాట్లాడుతూ, బీసీలకు ఇచ్చిన హామీల అమలు, 42 శాతం రిజర్వేషన్ సాధన వరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీసీలను ఐక్యం చేస్తూ హక్కుల కోసం ఉద్యమం కొనసాగిస్తామని అన్నారు. బడ్జెట్‌లో బీసీలకు రావాల్సిన నిధులను పూర్తిస్థాయిలో కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సుద్దాల దేవయ్య గారు మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేసి బీసీల ఐక్యతతో హక్కుల సాధనకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా నాయకులు మహమ్మద్ జహంగీర్ గారు, తెర్లుమాద్ది సర్పంచ్ బైతి నవీన్ గారు, మండల ఉపాధ్యక్షులు బాలయ్య గారు, సోషల్ మీడియా ఇంచార్జ్ తుమ్మనపల్లి శేఖర్ గారు, యూత్ మండల అధ్యక్షులు మామిండ్ల స్వామి గారు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *