Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

డా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ త్యాగానికి ఘన నివాళి.. ఏటికొప్పాక సచివాలయంలో గంభీరంగా స్మరణ కార్యక్రమం..!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ త్యాగానికి ఘన నివాళి.. ఏటికొప్పాక సచివాలయంలో గంభీరంగా స్మరణ కార్యక్రమం..!

వార్త ముఖ్యాంశాలు

  • అనకాపల్లి జిల్లా ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ) ఏటికొప్పాక గ్రామంలో నేడు దేశభక్తి భావోద్వేగాలతో నిండిన వాతావరణంలో డా.
  • శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
  • అనకాపల్లి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుల ఆదేశాల మేరకు, ఎలమంచిలి మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు శెన్నం శెట్టి శ్రీను గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

అనకాపల్లి జిల్లా ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ )

ఏటికొప్పాక గ్రామంలో నేడు దేశభక్తి భావోద్వేగాలతో నిండిన వాతావరణంలో డా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. అనకాపల్లి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుల ఆదేశాల మేరకు, ఎలమంచిలి మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు శెన్నం శెట్టి శ్రీను గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
దేశ సమగ్రత కోసం తన జీవితాన్ని అర్పించిన డా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి త్యాగం, దేశభక్తి, ఆలోచనా ధోరణి గురించి వక్తలు విపులంగా వివరించారు. ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సచివాలయ అధికారులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా ఆర్టిజన్ సెల్ నాయకులు మొల్లేటి ప్రసాద్ గారు, హైస్కూల్ ఎక్స్ చైర్మన్ నాగిరెడ్డి సత్యనారాయణ గారు, వేగి రామకృష్ణ గారు, T. రవి, N. చిరంజీవి, N. శ్రీను, షేక్ సాయిబాబా, మైలారి గోవిందు గారు, రాజు గారు, బాబ్జి గారు, సన్యాసిరావు గారు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
గ్రామ ప్రజల భారీ హాజరు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *