Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ప్రజాస్వామ్య పరిరక్షణలో పాత్రికేయుల పాత్ర కీలకం*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రజాస్వామ్య పరిరక్షణలో పాత్రికేయుల పాత్ర కీలకం*

వార్త ముఖ్యాంశాలు

  • *- మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం* *- నాయుడుపేటలో ఘనంగా 'శ్రీ బాలాజీ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్' ప్రెస్ క్లబ్ ప్రారంభం* పున్నమి న్యూస్-నాయుడుపేట:* ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని తిరుపతి మాజీ ఎంపీ,…
  • నాయుడుపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ప్రెస్ క్లబ్ భవనాన్ని ఆదివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.
  • ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

*- మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం*
*- నాయుడుపేటలో ఘనంగా ‘శ్రీ బాలాజీ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్’ ప్రెస్ క్లబ్ ప్రారంభం*

పున్నమి న్యూస్-నాయుడుపేట:* ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని తిరుపతి మాజీ ఎంపీ, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. నాయుడుపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ప్రెస్ క్లబ్ భవనాన్ని ఆదివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సమాచార వారధులుగా విలేకరులు పనిచేస్తారని పేర్కొన్నారు. సమాజంలోని బలహీన వర్గాలు, గొంతు వినిపించుకోలేని ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇతర మౌలిక వసతులు కల్పించే అంశాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అవధానం సుధీర్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన సమస్యలపై ప్రెస్ క్లబ్ వేదికగా ఐక్యంగా పోరాడాలని సూచించారు. విలేకరులు ప్రచురించే వార్తలను ప్రజాప్రతినిధులు సద్విమర్శలుగా స్వీకరించి, వాటి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అవధానం సుధీర్ పేర్కొన్నారు.

కార్యక్రమంలో పోలేరమ్మ దేవస్థానం చైర్మన్ నాన్నబాల సుబ్బారావు, టీడీపీ పట్టణ క్లస్టర్ ఇన్‌ఛార్జి నిత్య కృష్ణారెడ్డి, సీనియర్ నాయకుడు పసుల గంగా ప్రసాద్, సీనియర్ జర్నలిస్టులు వార్ల చంద్రరాజు, ఉపాధ్యక్షులు గల్లా శ్రీనివాసులు, అడ్వకేట్ ధారా రవి, సీనియర్ టీడీపీ నాయకులు ఎస్ జి రాజేష్, అడ్వకేట్ మేడపా శ్రీనివాసులు, మైలారి రాజశేఖర్, బీసీ నాయకులు జులపాటి మస్తాన్, జి.వి.ఆర్.నాయుడు, ఎన్. చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. కమిటీ సభ్యులు ధారా అరుణ్, నెలవల చంద్రశేఖర్, కురుగొండ రమేష్, కావ్య, వెంకీ, ఎన్.ఎం.బాబు, అరిగెల ప్రసాద్, తంబాకు చందు, మావుడూరు చిరంజీవి, శ్రావణ్ మరియు జిల్లా కమిటీ అధ్యక్షులు అరవ జయపాల్ ఎం.హరి, కె.హరిబాబు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *