Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

గుణపాడు గ్రామ ప్రజలకు టిబి నిర్ధారణ పరీక్షలు, *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 26 చిట్టమూరు మండలం*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గుణపాడు గ్రామ ప్రజలకు టిబి నిర్ధారణ పరీక్షలు, *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 26 చిట్టమూరు మండలం*

ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిట్టమూరు మండలం గుణపాడు గ్రామ ప్రజలకు శనివారం టి బి ముందస్తు నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన విద్యా ప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు వారి శ్రీమతి ఆదిలక్ష్మి జ్ఞాపకార్థం ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుణపాడు గ్రామంలో ముక్తభారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలందరికీ హ్యాండిల్ ఎక్సరే ద్వారా టి బి వ్యాధిని నిర్ధారించే నిమిత్తం చెస్ట్ ఎక్సరే పరీక్షలను నిర్వహించి టిబి వ్యాధిగ్రస్తులను గుర్తించారు.
అనంతరం బీపీ పరీక్షలు చేపట్టారు.
టివి నిర్ధారణ అయినవారికి గళ్ళ పరీక్షలు చేసి వ్యాధి పూర్తిగా నిర్ధారణ అయితే వారికి ఆరు నెలల కోర్సు కు సంబంధించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
టీబీ వ్యాధి నిర్ధారణమైన రోగులకు పౌష్టికాహారాన్ని ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి టిబి సూపర్వైజర్ గోవర్ధన్ ఫీల్డ్ కోఆర్డినేటర్ ఏడుకొండలు ఎం ఎల్ హెచ్ పి హరిత హెల్త్ సూపర్వైజర్ రవి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

గుణపాడు గ్రామ ప్రజలకు టిబి నిర్ధారణ పరీక్షలు, *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 26 చిట్టమూరు మండలం*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *