Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

రైతులకు అందుబాటులో లేని ఉద్యాన అధికారిపై చర్యలకు డిమాండ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రైతులకు అందుబాటులో లేని ఉద్యాన అధికారిపై చర్యలకు డిమాండ్

రైతుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యాన శాఖ అధికారి బి.లోకేష్‌పై తక్షణ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పందికాళ్ల మణి డిమాండ్ చేశారు. రైతులతో కలిసి ఎంపీడీవో శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. బొప్పాయి, అరటి, మామిడి, నిమ్మ తదితర పంటలకు తెగుళ్ల నివారణ, ఆధునిక సాగుపై సకాలంలో సలహాలు అందడం లేదని ఆరోపించారు. ఫోన్‌లో సంప్రదించినా అధికారి స్పందించడం లేదన్నారు. ఫిర్యాదులపై వెంటనే సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు సదస్సులు నిర్వహించి అవగాహన కల్పించడంతో పాటు, రైతులకు నిరంతరం అందుబాటులో ఉండే అధికారిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకుడు ఓబిలి పెంచలయ్య, రైతు సంఘం నాయకుడు కటారి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

రైతులకు అందుబాటులో లేని ఉద్యాన అధికారిపై చర్యలకు డిమాండ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *