Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

KRR హిల్స్ హస్తినాపురం కాలనీ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా లిక్కి తిరుపతి రెడ్డి ఎన్నిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
KRR హిల్స్ హస్తినాపురం కాలనీ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా లిక్కి తిరుపతి రెడ్డి ఎన్నిక

KRR హిల్స్ హస్తినాపురం కాలనీ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా లిక్కి తిరుపతి రెడ్డి ఎన్నిక

పున్నమి న్యూస్
29 జూన్ 2026
తెలంగాణ ఇంచార్జి
9640204826

హస్తినాపురం KRR హిల్స్ కాలనీ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన లిక్కి తిరుపతి రెడ్డి కి మేడిపల్లి నక్కర్త 9వ వార్డు సభ్యులు ఘనం సన్మానం
ఈ సందర్భంగా వారు పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. వార్డు సభ్యులు మాట్లాడుతూ, కాలనీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పనలో లిక్కి తిరుపతి రెడ్డి సమర్థ నాయకత్వం అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కాలనీలో రహదారులు, పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రజల సహకారంతో కాలనీని ఆదర్శవంతమైన నివాస ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ఆయన కృషి చేస్తారని పేర్కొన్నారు.
నూతన బాధ్యతలు చేపట్టిన లిక్కి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కాలనీలోని ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధే లక్ష్యంగా అందరి సహకారంతో ముందుకు సాగుతానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మేడిపల్లి నక్కర్త 9వ వార్డు సభ్యులు ఆలంపల్లి మహేష్, లిక్కి కృష్ణారెడ్డి (LKR), డాక్టర్ మహేందర్, ఆలంపల్లి శ్రీకాంత్, శివ తదితరులు పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో నిర్వహించబడింది.

KRR హిల్స్ హస్తినాపురం కాలనీ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా లిక్కి తిరుపతి రెడ్డి ఎన్నిక

KRR హిల్స్ హస్తినాపురం కాలనీ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా లిక్కి తిరుపతి రెడ్డి ఎన్నిక

Leave a comment

Your email address will not be published. Required fields are marked *