Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

విద్యా సంబంధ చర్చలకు రూసో ను పిలవండి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • ప్రతివారం జరిగే విద్యా సంబంధమైన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర విద్యాశాఖ చేపడుతున్న సమావేశాలకు ,చర్చలకు రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల యునైటెడ్ ఆర్గనైజేషన్ ( రూసో) ను ఆహ్వానించాలని రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల యునైటెడ్ ఆర్గనైజేషన్ (రూసో ) చైర్మన్ సివి ప్రసాద్ విద్యాశాఖ కమీషనర్ ను…
  • ఏకపక్షంగా చర్చలు జరగకుండా ఉండాలంటే రిజిస్టర్ సంఘాలను కూడా ఆహ్వానించాలని డిమాండ్ చేశారు.
  • రిజిస్టర్ సంఘాల అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ప్రతివారం జరిగే విద్యా సంబంధమైన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర విద్యాశాఖ చేపడుతున్న సమావేశాలకు ,చర్చలకు రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల యునైటెడ్ ఆర్గనైజేషన్ ( రూసో) ను ఆహ్వానించాలని రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల యునైటెడ్ ఆర్గనైజేషన్ (రూసో ) చైర్మన్ సివి ప్రసాద్ విద్యాశాఖ కమీషనర్ ను కోరారు. ఏకపక్షంగా చర్చలు జరగకుండా ఉండాలంటే రిజిస్టర్ సంఘాలను కూడా ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. రిజిస్టర్ సంఘాల అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గతంలో ఉన్న కమీషనర్ రిజిస్టర్డ్ సంఘాలతో అనేక సమావేశాలు ఏర్పాటు చేశారని గుర్తుకు తెచ్చారు. అదే పందాను తిరిగి ప్రవేశపెట్టాలని కోరారు. ప్రస్తుతం కొనసాగుతున్న మెడికల్ రియాంబర్స్మెంట్ వ్యవస్థ ఆశల పల్లకిలో కొనసాగుతున్నదని తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వైద్యానికి క్యాస్ లెస్ ట్రీట్మెంట్ ప్రతి వైద్యశాలలో కల్పించాలని డిమాండ్ చేశారు. వేతనాలలో రుసుము మినహాయింపు చేసిన తగిన ఫలితం లేకుండా పోతున్నదని తెలిపారు. శుక్రవారం జరిగిన మెడికల్ రియాంబర్స్మెంట్ అంశంపై రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాలను పిలిచి ఉంటే మరింత విస్తృతమైన చర్చ జరిగి ఉండేదని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *