Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

విశాఖలో మహాకవి శ్రీశ్రీ జయంతి వేడుకలు ఘనంగా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విశాఖలో మహాకవి శ్రీశ్రీ జయంతి వేడుకలు ఘనంగా

వార్త ముఖ్యాంశాలు

  • జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) గారి 116వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
  • ఈ కార్యక్రమానికి ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వన్నెంరెడ్డి సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
  • ముందుగా శ్రీశ్రీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) గారి 116వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వన్నెంరెడ్డి సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా శ్రీశ్రీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
శ్రీశ్రీ గారు సాహిత్య విప్లవానికి మార్గదర్శకుడిగా, పీడిత ప్రజల తరఫున అభ్యుదయ కవిత్వాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ‘మహాప్రస్థానం’ వంటి రచనలతో తెలుగు సాహిత్యంలో కొత్త దిశను చూపారన్నారు. వేలాది సినీ గీతాలతో తెలుగు పాటలకు కొత్త అర్థం ఇచ్చిన ఆయనకు సాహిత్య అకాడమీ, జాతీయ చలనచిత్ర, నంది పురస్కారాలు లభించాయి.
ఈ సందర్భంగా ఆయన కవిత్వం ప్రాధాన్యతపై పాఠకులకు వివరించారు. కార్యక్రమంలో కార్యదర్శి బుర్రి కుమార్ రాజు, లైబ్రేరియన్ పి.వి. నూకరాజు, వర్మతో పాటు విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *