Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అసెంబ్లీ క్రీడా మహోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అసెంబ్లీ క్రీడా మహోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 22: శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ సబ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 26 వరకు విజయవాడలో నిర్వహించనున్న క్రీడా మహోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు.
  • ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (SAP) చైర్మన్‌తో కలిసి విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్ద క్రీడా వేదిక, మైదానం, ఇతర సదుపాయాల ఏర్పాట్లను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు.
  • కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరిపారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 22: శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ సబ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 26 వరకు విజయవాడలో నిర్వహించనున్న క్రీడా మహోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (SAP) చైర్మన్‌తో కలిసి విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్ద క్రీడా వేదిక, మైదానం, ఇతర సదుపాయాల ఏర్పాట్లను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అనేక మంది యువ క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారని అలాంటి ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రౌండ్ స్థాయిలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమాల ద్వారా అవసరమైన సదుపాయాలు కల్పించాలని శ్రీకాళహస్తిలో సమగ్ర క్రీడా మైదానం (స్టేడియం) నిర్మాణానికి సహకారం అందించాలని, ఆర్ట్స్ కాలేజ్ మైదానాన్ని అభివృద్ధి చేయడాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని SAP చైర్మన్‌ను విజ్ఞప్తి చేశారు. క్రీడలు యువతకు శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా నియమం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొంటూ, రాష్ట్రవ్యాప్తంగా క్రీడా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఈ పరిశీలనలో రవి నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *