Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

*బ్రహ్మంగారి మఠం మండలంలోని హై స్కూల్ ప్లస్ తరగతుల ప్రారంభించాలని డిఆర్ఓ కు వినతిపత్రం:- ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *బ్రహ్మంగారి మఠం మండలంలోని హై స్కూల్ ప్లస్ తరగతుల ప్రారంభించాలని డిఆర్ఓ కు వినతిపత్రం:- ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్* కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని హైస్కూల్ ప్లస్ రీఓపెన్ చేసి తరగతుల ప్రారంభించాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు పెద్దులపల్లె ప్రభాకర్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు బత్తల శివతేజ…
  • ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ........
  • కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో హై స్కూల్ ప్లస్ 2024లో మంజూరు అయిందని ఒక ఏడాది పాటు 25 మంది విద్యార్థులతో తరగతులకు కూడా నిర్వహించి పూర్తిస్థాయి సిబ్బంది లేరనే నెపంతో రెండో ఏడాది కళాశాలను మూసివేయడం జరిగిందని ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలను తిరిగి…

*బ్రహ్మంగారి మఠం మండలంలోని హై స్కూల్ ప్లస్ తరగతుల ప్రారంభించాలని డిఆర్ఓ కు వినతిపత్రం:- ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్*

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని హైస్కూల్ ప్లస్ రీఓపెన్ చేసి తరగతుల ప్రారంభించాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు పెద్దులపల్లె ప్రభాకర్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు బత్తల శివతేజ సోమవారం కడప కలెక్టరేట్లోని గ్రీవెన్స్ లో డిఆర్ఓ మల్లికార్జున గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…….. కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో హై స్కూల్ ప్లస్ 2024లో మంజూరు అయిందని ఒక ఏడాది పాటు 25 మంది విద్యార్థులతో తరగతులకు కూడా నిర్వహించి పూర్తిస్థాయి సిబ్బంది లేరనే నెపంతో రెండో ఏడాది కళాశాలను మూసివేయడం జరిగిందని ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలను తిరిగి ఈ విద్యా సంవత్సరంలోనే తరగతులు ప్రారంభించాలని వారు కోరారు. బ్రహ్మంగారి మఠం మండలం గ్రామీణ ప్రాంతం అవడంతో చుట్టూ గ్రామాల ప్రజలు ఎక్కువగా వ్యవసాయ ఆధారిత పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మండలంలో అధిక శాతం పేద బడుగు బలహీనవర్గాల ప్రజలు ఉన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ఉన్నత విద్య చదివించాలని ఆశ ఉన్నప్పటికీ ప్రైవేట్ కళాశాలలో చదివించే స్తోమత లేక ప్రభుత్వ కళాశాలకు వెళ్లాలంటే చుట్టూ 50 కిలోమీటర్ల పైన వెళ్లాల్సిన పరిస్థితి తో చదువు మధ్యలోనే ఆపేసి వ్యవసాయ కూలీలుగా మారుతున్నారు. హైస్కూల్ ప్లస్ కు భవనాలు దాదాపు 80% పూర్తయి ఉన్నాయి వాటిని వాడుకలోకి తీసుకొని తరగతులు ప్రారంభించాలని వారు కోరారు. పాత గురుకుల పాఠశాల భవనాలు నిరుపయోగంగా ఉన్నప్పటికీ వాటికి అతిగతి లేని పరిస్థితి బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో నెలకొంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు సంబంధిత విద్యాశాఖ అధికారులతో ఈ విద్యా సంవత్సరానికి తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *