Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నారాయణపేట

పెగడబండ రాము కుటుంబానికి అండగా పదో తరగతి మిత్రులు రూ.22 వేల ఆర్థిక సహాయం.. ముగ్గురు పిల్లలకు మాగనూరు ఆరాధ్య హైస్కూల్‌లో పదో తరగతి వరకు ఉచిత విద్య

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పెగడబండ రాము కుటుంబానికి అండగా పదో తరగతి మిత్రులు రూ.22 వేల ఆర్థిక సహాయం.. ముగ్గురు పిల్లలకు మాగనూరు ఆరాధ్య హైస్కూల్‌లో పదో తరగతి వరకు ఉచిత విద్య

వార్త ముఖ్యాంశాలు

  • వాగులో నీటిలో మునిగి సుమారు 15 రోజుల క్రితం మృతి చెందిన తమ స్నేహితుడు పెగడబండ రాము కుటుంబానికి పదో తరగతి మిత్రులు అండగా నిలిచారు.
  • రాము కుటుంబాన్ని పరామర్శించిన మిత్రులు అందరూ కలిసి రూ.22,000 ఆర్థిక సహాయం అందించారు.
  • అదేవిధంగా రాముకు చెందిన ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు మొత్తం ముగ్గురు పిల్లలకు మాగనూరులోని ఆరాధ్య హైస్కూల్‌లో LKG నుంచి పదో తరగతి వరకు ఉచితంగా విద్యాబోధన అందిస్తామని మిత్రుడు సగరం మధుసూదన్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

వాగులో నీటిలో మునిగి సుమారు 15 రోజుల క్రితం మృతి చెందిన తమ స్నేహితుడు పెగడబండ రాము కుటుంబానికి పదో తరగతి మిత్రులు అండగా నిలిచారు. రాము కుటుంబాన్ని పరామర్శించిన మిత్రులు అందరూ కలిసి రూ.22,000 ఆర్థిక సహాయం అందించారు.
అదేవిధంగా రాముకు చెందిన ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు మొత్తం ముగ్గురు పిల్లలకు మాగనూరులోని ఆరాధ్య హైస్కూల్‌లో LKG నుంచి పదో తరగతి వరకు ఉచితంగా విద్యాబోధన అందిస్తామని మిత్రుడు సగరం మధుసూదన్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
అవసరమైన సమయంలో రాము కుటుంబానికి మిత్రులుగా అండగా ఉంటామని, భవిష్యత్తులో కూడా ఎలాంటి సహాయం కావాలన్నా తమ వంతు సహకారం అందిస్తామని మిత్రులు తెలిపారు. ఈ సహాయ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క మిత్రుడికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *