Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

పిజెఆర్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం – వైభవంగా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • చందానగర్‌లోని పి జె ఆర్ స్టేడియం వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించబడింది.
  • ఈ కార్యక్రమాన్ని పతాంజలి యోగ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా, పెద్ద సంఖ్యలో యోగ అభ్యాసకులు పాల్గొని ఆధికారిక యోగా ప్రోటోకాల్‌ను పాటించారు.
  • ఈ సందర్భంగా యోగ గురువులు పుట్ట వినయకుమార్ గౌడ్, తరిగొప్పుల స్వేత, జగన్నాథం, బోనకుర్తి విఠల్ లను అభ్యాసకులు ఘనంగా సన్మానించారు.

చందానగర్‌లోని పి జె ఆర్ స్టేడియం వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని పతాంజలి యోగ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా, పెద్ద సంఖ్యలో యోగ అభ్యాసకులు పాల్గొని ఆధికారిక యోగా ప్రోటోకాల్‌ను పాటించారు.

ఈ సందర్భంగా యోగ గురువులు పుట్ట వినయకుమార్ గౌడ్, తరిగొప్పుల స్వేత, జగన్నాథం, బోనకుర్తి విఠల్ లను అభ్యాసకులు ఘనంగా సన్మానించారు.

వారు మాట్లాడుతూ –

“యోగ అంటే వ్యాయామం మాత్రమే కాదు, అది సంపూర్ణ జీవన విధానం. ఇది మానసిక ప్రశాంతతను ఇచ్చే దివ్య ఔషధం. అనారోగ్యాల నుంచి మనల్ని రక్షించడమే కాక, ఆయుష్షును పెంపొందించే సాధన కూడా యోగానే!” అని పేర్కొన్నారు.

ఈ వేడుకలో చిన్నారులు చేసిన యోగా విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితం కోసం నిత్య యోగా పాటించాల్సిన అవసరాన్ని పుంఖానుపుంఖంగా వివరించారు.

ఈ కార్యక్రమం ఆరోగ్య చైతన్యం spread చేసే గొప్ప వేదికగా నిలిచింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *