Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అభినందనీయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అభినందనీయం

వార్త ముఖ్యాంశాలు

  • శశి హార్ట్ కేర్ సెంటర్‌ను సందర్శించిన బీఆర్‌ఎస్‌వీ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ నిర్మల్, సెప్టెంబర్ 21: నిర్మల్ జిల్లా కేంద్రంలోని శశి హార్ట్ కేర్ సెంటర్‌ను బీఆర్‌ఎస్‌వీ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ ఆదివారం సందర్శించారు.
  • ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు.
  • అనంతరం ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, హృదయ సంబంధిత చికిత్సలు, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై ఆయన వివరాలు తెలుసుకున్నారు.

శశి హార్ట్ కేర్ సెంటర్‌ను సందర్శించిన బీఆర్‌ఎస్‌వీ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్
నిర్మల్, సెప్టెంబర్ 21: నిర్మల్ జిల్లా కేంద్రంలోని శశి హార్ట్ కేర్ సెంటర్‌ను బీఆర్‌ఎస్‌వీ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు.
అనంతరం ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, హృదయ సంబంధిత చికిత్సలు, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై ఆయన వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మిర్జా షోయేబ్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రజలకు నాణ్యమైన హృదయ వైద్య సేవలు అందించే ఆసుపత్రి ఉండటం అభినందనీయమన్నారు. ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు స్థానికంగానే అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
పున్నమి రిపోర్టర్ – అబ్దుల్ సాదిక్, నిర్మల్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *