Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

గాజువాకలో పార్టీ టికెట్ల రేస్ ! పల్లా వద్ద ఆశావహుల క్యూ.. ఒక్కో వార్డులో టికెట్ కోసం హోరాహోరీ సీనియర్లు.. మాజీ కార్పొరేటర్లు.. కొత్త ముఖాలు.. ఎవరికి ఛాన్స్‌?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గాజువాకలో పార్టీ టికెట్ల రేస్ ! పల్లా వద్ద ఆశావహుల క్యూ.. ఒక్కో వార్డులో టికెట్ కోసం హోరాహోరీ సీనియర్లు.. మాజీ కార్పొరేటర్లు.. కొత్త ముఖాలు.. ఎవరికి ఛాన్స్‌?

విశాఖ గాజువాక, సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి): జీవీఎంసీ ఎన్నికల నగారా మోగకముందే గాజువాకలో రాజకీయ వేడి రాజుకుంది. కార్పొరేటర్ టికెట్ కోసం టీడీపీ ఆశావహులు కదం తొక్కుతున్నారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును వరుసగా కలుస్తూ తమ సేవలు, రాజకీయ అనుభవాలను వివరిస్తూ టికెట్ కోసం వినతులు అందిస్తున్నారు. దీంతో గాజువాకలో టికెట్ల రాజకీయం రసవత్తరంగా మారింది.

89వ వార్డుపై నమ్మి సింహాద్రి కన్నేశారు. తనకు లేదా తన భార్య నమ్మి ధనలక్ష్మికి అవకాశం ఇవ్వాలని పల్లాను కోరారు. 2003 నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నానని, వివిధ పదవులు నిర్వహించడంతో పాటు నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేశానని ఆయన పేర్కొన్నారు.

101వ వార్డులో మాడిశ కనకరాజు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. 1994 నుంచి టీడీపీ కోసం పనిచేస్తున్నానని, పలు ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేశానని చెబుతూ టికెట్ కోసం వినతి చేశారు. మరోవైపు 89, 91వ వార్డుల్లో అవకాశం కల్పించాలని సింగూరి అనంత్ పల్లాను కోరారు.

99వ వార్డులో మాజీ కార్పొరేటర్ బొండా జగన్నాధం(జగన్) పేరు గట్టిగా వినిపిస్తోంది. జగన్‌కే టికెట్ ఇవ్వాలని పలు సామాజిక వర్గాల ప్రతినిధులు పల్లాను కలిసి కోరడం చర్చనీయాంశంగా మారింది.

ఇక 90వ వార్డులో కూటమి టికెట్ కోసం లంక లత, మహమ్మద్ రఫీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు జనసేన బలం, మరోవైపు టీడీపీ రాజకీయ అనుభవం.. దీంతో ఈ వార్డులో టికెట్ పోరు మరింత ఆసక్తికరంగా మారింది.

ఒక్కో వార్డులో ‘టికెట్ వార్’!

గాజువాకలో సీనియర్ల నుంచి మాజీ ప్రజాప్రతినిధుల వరకు టికెట్ కోసం రంగంలోకి దిగడంతో పార్టీ అధిష్ఠానానికి అభ్యర్థుల ఎంపిక సవాల్‌గా మారుతోంది. ఎవరి బలం ఎంత? ఎవరి వెంట కార్యకర్తలు ఉన్నారు? ఎవరు గెలుపు గుర్రం? అన్నదానిపై స్థానికంగా చర్చ సాగుతోంది. పల్లా నిర్ణయం కోసం ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

గాజువాకలో పార్టీ టికెట్ల రేస్ ! పల్లా వద్ద ఆశావహుల క్యూ.. ఒక్కో వార్డులో టికెట్ కోసం హోరాహోరీ సీనియర్లు.. మాజీ కార్పొరేటర్లు.. కొత్త ముఖాలు.. ఎవరికి ఛాన్స్‌?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *