Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

కండలేరు భూసేకరణ వివాదాల సామరస్య పరిష్కారంపై సమాధాన్ సమావేశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కండలేరు భూసేకరణ వివాదాల సామరస్య పరిష్కారంపై సమాధాన్ సమావేశం

జూన్ 18న నెల్లూరు జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి “సమాధాన్ సమరోహ్” కార్యక్రమం నిర్వహించారు. ఇందులో రాపూర్ మండలంలోని తెలుగుగంగా ప్రాజెక్టు కండలేరు జలాశయం కోసం గతంలో భూసేకరణ చేసిన భూముల పరిహార వివాదాలపై చర్చించారు. మార్కెట్ విలువకు అనుగుణంగా పరిహారం పెంపు అంశంపై అధికారులు, న్యాయవాదులు అభిప్రాయాలు పంచుకున్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, ఆర్డీవో నిర్మలానందబాబు, డిప్యూటీ కమిషనర్ ఎం. సత్యప్రకాశ్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఎస్.కే. షమీం, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ డివిజనల్ మేనేజర్ సాయి జోష్ణ, బార్ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి, ప్రభుత్వ న్యాయవాది సీహెచ్. శ్రీహరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

కండలేరు భూసేకరణ వివాదాల సామరస్య పరిష్కారంపై సమాధాన్ సమావేశం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *