Sunday, 7 December 2025
  • Home  
  • ఫుడ్ బిజినెస్ చేస్తున్నారా..? లైసెన్స్ ఉందా?
- హైదరాబాద్

ఫుడ్ బిజినెస్ చేస్తున్నారా..? లైసెన్స్ ఉందా?

పున్నమి ప్రతి నిధి ఫుడ్ బిజినెస్ నిర్వహించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా FSSAI లైసెన్స్ పొందాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, కిరాణా దుకాణాలు, క్యాటరింగ్, ఫుడ్ ప్యాకెజింగ్, ఫుడ్ ట్రాన్స్‌పోర్ట్ వంటి అనేక రంగాలకు సంబంధించిన వ్యాపారాలు తప్పనిసరిగా ఈ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. లైసెన్స్ లేకుండా ఫుడ్ వ్యాపారం చేస్తున్నట్లయితే భారీ జరిమానాలు విధించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వ్యాపారం స్థాయి ఆధారంగా రిజిస్ట్రేషన్, స్టేట్ లైసెన్స్, సెంట్రల్ లైసెన్స్‌గా మూడు రకాల లైసెన్స్‌లు ఉంటాయని తెలిపారు. చిన్న వ్యాపారులు వార్షిక టర్నోవర్ ఆధారంగా సాధారణ రిజిస్ట్రేషన్ చేసుకోగా, పెద్ద వ్యాపారాలు స్టేట్ లేదా సెంట్రల్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆయా లైసెన్స్‌లకు నిర్ణీత రుసుములు ఉన్నాయని, నిబంధనలు పాటించకుండా ఫుడ్ ఉత్పత్తులు విక్రయిస్తే రూ.2,000 నుంచి రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యం పరిరక్షణలో భాగంగానే ఈ నిబంధనలు అమలు చేస్తున్నామని, ఫుడ్ వ్యాపారాలు నిర్వహించే వారు వెంటనే తమ లైసెన్స్‌లను సక్రమంగా పొందాలని సూచించారు.

పున్నమి ప్రతి నిధి

ఫుడ్ బిజినెస్ నిర్వహించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా FSSAI లైసెన్స్ పొందాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, కిరాణా దుకాణాలు, క్యాటరింగ్, ఫుడ్ ప్యాకెజింగ్, ఫుడ్ ట్రాన్స్‌పోర్ట్ వంటి అనేక రంగాలకు సంబంధించిన వ్యాపారాలు తప్పనిసరిగా ఈ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు.
లైసెన్స్ లేకుండా ఫుడ్ వ్యాపారం చేస్తున్నట్లయితే భారీ జరిమానాలు విధించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వ్యాపారం స్థాయి ఆధారంగా రిజిస్ట్రేషన్, స్టేట్ లైసెన్స్, సెంట్రల్ లైసెన్స్‌గా మూడు రకాల లైసెన్స్‌లు ఉంటాయని తెలిపారు.
చిన్న వ్యాపారులు వార్షిక టర్నోవర్ ఆధారంగా సాధారణ రిజిస్ట్రేషన్ చేసుకోగా, పెద్ద వ్యాపారాలు స్టేట్ లేదా సెంట్రల్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆయా లైసెన్స్‌లకు నిర్ణీత రుసుములు ఉన్నాయని, నిబంధనలు పాటించకుండా ఫుడ్ ఉత్పత్తులు విక్రయిస్తే రూ.2,000 నుంచి రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రజల ఆరోగ్యం పరిరక్షణలో భాగంగానే ఈ నిబంధనలు అమలు చేస్తున్నామని, ఫుడ్ వ్యాపారాలు నిర్వహించే వారు వెంటనే తమ లైసెన్స్‌లను సక్రమంగా పొందాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.