ముస్తాబాద్ / ఏప్రిల్ /పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్ మండలం నామాపూర్ ఆదర్శ పాఠశాలలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కందన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యాభివృద్ధికి చేసిన కృషి ఎంతో గొప్పదని తెలిపారు. విద్య ద్వారా సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని పూలే చూపించిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని పూలే జీవిత విశేషాలను వివరించారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఉపన్యాసాలు నిర్వహించారు. ఈ వేడుకలు పాఠశాలలో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.


