శ్రీకాళహస్తి, ఏప్రిల్ 13 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి స్థానిక పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి జయంతి సందర్భంగా ఏప్రిల్ 15న చేపట్టనున్న సేవా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ యువతకు ఉపాధి కల్పించేందుకు మెగా జాబ్ మేళా, నిరుపేదల సొంతింటి కల నెరవేర్చే టిడ్కో ఇళ్ల పంపిణీ, అలాగే ఉచిత కంటి, నొప్పి నివారణ వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేసి, లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకునేలా ప్రతి కార్యకర్త బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రజా సేవలో నిరంతరం కృషి చేస్తూ, బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి ఆశయాల సాధన దిశగా శ్రీకాళహస్తిని అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

తండ్రి బొజ్జల ఆశయాల సాధనకు తనయుడు సుదీర్ రెడ్డి ముందడుగు