Thursday, 5 February 2026
  • Home  
  • ఖమ్మంపల్లిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
- తెలంగాణ - పెద్దపల్లి

ఖమ్మంపల్లిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

_క్రైస్తవ సోదర సోదరీమణులకు సర్పంచ్ నక్క రాజేశ్వరి రాజయ్య దంపతుల శుభాకాంక్షలు_ మంథని, డిసెంబర్ 25 ( పున్నమి ప్రతినిధి ):పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామంలో క్రైస్తవ సోదర సోదరీమణులు క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రత్యేక ప్రార్థనలు, వేడుకలు నిర్వహించగా గ్రామ సర్పంచ్ నక్క రాజేశ్వరి – రాజయ్య దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జాన్ వెస్లీ (ఫేత్ బాప్టిస్ట్ చర్చ్), సాముల జీసస్ (ప్రేయర్ చర్చ్) ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను సర్పంచ్ దంపతులు ఆవిష్కరించారు. అనంతరం క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి గ్రామస్తులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నక్క రాజేశ్వరి మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. గ్రామంలో అన్ని మతాల ప్రజలు సోదరభావంతో కలిసి పండుగలు జరుపుకోవడం ఆనందకరమని అన్నారు. క్రైస్తవులందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, క్రైస్తవ సంఘ నాయకులు, మహిళలు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

_క్రైస్తవ సోదర సోదరీమణులకు సర్పంచ్ నక్క రాజేశ్వరి రాజయ్య దంపతుల శుభాకాంక్షలు_

మంథని, డిసెంబర్ 25 ( పున్నమి ప్రతినిధి ):పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామంలో క్రైస్తవ సోదర సోదరీమణులు క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రత్యేక ప్రార్థనలు, వేడుకలు నిర్వహించగా గ్రామ సర్పంచ్ నక్క రాజేశ్వరి – రాజయ్య దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జాన్ వెస్లీ (ఫేత్ బాప్టిస్ట్ చర్చ్), సాముల జీసస్ (ప్రేయర్ చర్చ్) ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను సర్పంచ్ దంపతులు ఆవిష్కరించారు. అనంతరం క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి గ్రామస్తులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నక్క రాజేశ్వరి మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. గ్రామంలో అన్ని మతాల ప్రజలు సోదరభావంతో కలిసి పండుగలు జరుపుకోవడం ఆనందకరమని అన్నారు. క్రైస్తవులందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, క్రైస్తవ సంఘ నాయకులు, మహిళలు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.