సీతారామపురం జనవరి (పున్నమి ప్రతినిధి)
సీతారామపురం మండలంలోని యుటిఎఫ్ శాఖకు చెందిన ఉపాధ్యాయులకు గురువారం గోనువారి పల్లి కి చెందిన టిడిపి యువ నాయకుడు కుర్రా రత్తయ్య సీతారామపురం మండల కేంద్రంలోని యుటిఎఫ్ కార్యాలయంలో లంచ్ బ్యాగులను అందించారు. ముందుగా నూతన సంవత్సర కేక్ ను కట్ చేసి ఉపాధ్యాయులకు పంచిపెట్టి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా యుటిఎఫ్ జిల్లా కౌన్సిలర్ ఎడమ తిరుపతయ్య మాట్లాడుతూ సీతారామపురం మండలంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి గుర్తింపు పొందిన కుర్ర రత్తయ్య కు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టిడిపి మండల కన్వీనర్లు కప్పా ప్రభాకర్ రాజు, వెంగలశెట్టి వెంకటేశ్వర్లు, సొసైటీ అధ్యక్షుడు సోమనబోయిన రాజశేఖర్, మండల టిడిపి యూత్ అధ్యక్షుడు పసుపులేటి వికాస్ బాబు, యుటిఎఫ్ నాయకులు గొడ్లవీటి వెంకటేశ్వర్లు, అన్నంగి ప్రసాదు, డివిఆర్, పవిత్ర కుమారి, మురళి, నరసింహ రాజు, మహేష్, ముజిబా బేగం, నాయకులు షేక్ బాబు, ఏనుగుల సుబ్బరాయుడు, బండి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


