Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నకిలీ మందులపై కేంద్రం కఠిన చర్యలు – క్యూఆర్ కోడ్ తప్పనిసరి.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నకిలీ మందులపై కేంద్రం కఠిన చర్యలు – క్యూఆర్ కోడ్ తప్పనిసరి.

వార్త ముఖ్యాంశాలు

  • దేశంలో నకిలీ మందుల తయారీ, విక్రయాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
  • వ్యాక్సిన్లు, క్యాన్సర్ మందులు, యాంటీమైక్రోబియల్ ఔషధాలు, నార్కోటిక్ మందుల ప్యాకేజింగ్‌పై క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్ తప్పనిసరి చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
  • ఈ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా మందు తయారీ సంస్థ, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీ వంటి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

దేశంలో నకిలీ మందుల తయారీ, విక్రయాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్లు, క్యాన్సర్ మందులు, యాంటీమైక్రోబియల్ ఔషధాలు, నార్కోటిక్ మందుల ప్యాకేజింగ్‌పై క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్ తప్పనిసరి చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా మందు తయారీ సంస్థ, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీ వంటి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. దీంతో నకిలీ మందులను గుర్తించడం, సరఫరా వ్యవస్థను పర్యవేక్షించడం మరింత సులభమవుతుంది. వ్యాక్సిన్లు, క్యాన్సర్ మందులకు ఈ నిబంధనలు 2027 జూలై 1 నుంచి, యాంటీమైక్రోబియల్ మందులకు 2028 జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం ప్రజల ఆరోగ్య భద్రతకు మరింత బలాన్నిస్తుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *