Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

గిరిజనులు ప్రచారాలకేనా నామినేటెడ్ పదవులకు అనర్హులా..ఇదెక్కడి న్యాయం:ఎస్టీ నేత సుబ్బయ్య

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గిరిజనులు ప్రచారాలకేనా నామినేటెడ్ పదవులకు అనర్హులా..ఇదెక్కడి న్యాయం:ఎస్టీ నేత సుబ్బయ్య

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో 22,000 మంది గిరిజన ఓటర్లు ఉన్నారని,2019 నుండి 2024 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి వైసిపి నాయకులతో పోరాడి,జైళ్లకు వెళ్లి,దెబ్బలు తిని కుటుంబాలు కూడా వదిలేసి ఈరోజు బొజ్జల సుధీర్ రెడ్డి…
  • .అని గిరిజన నేత సుబ్బయ్య తన నిరసన గళాన్ని వినిపించారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో 22,000 మంది గిరిజన ఓటర్లు ఉన్నారని,2019 నుండి 2024 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి వైసిపి నాయకులతో పోరాడి,జైళ్లకు వెళ్లి,దెబ్బలు తిని కుటుంబాలు కూడా వదిలేసి ఈరోజు బొజ్జల సుధీర్ రెడ్డి విజయానికి కృషి చేశాము.కానీ నేడు యానాధులకు ఒక్క నామినేటెడ్ పదవి కూడా వరించలేదని సుబ్బయ్య అన్నారు.శ్రీకాళహస్తి దేవస్థానంలో పాలకమండలి పదవి ఎవరికి దక్కలేదు మరియు శ్రీకాళహస్తి పట్టణ కో-ఆపరేటివ్ బ్యాంక్ మెంబర్లలో గిరిజనులకు చోటు లేదు మరియు మార్కెట్ యార్డ్ కమిటీలలో మెంబర్లలో ఎస్టీలకి చోటు లేదు మరి గిరిజనులు దేనికి పనికిరారా ఎలక్షన్ ప్రచారాలకు మాత్రమే పనికొస్తారా పదవులకు కాదా. .అని గిరిజన నేత సుబ్బయ్య తన నిరసన గళాన్ని వినిపించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *