Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నాగర్‌కర్నూల్

NGKL: దాతృత్వం చాటుకున్న దంపతులు.. విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, విద్యా సామగ్రి పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

నాగర్‌కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో గద్వాల జిల్లాకు చెందిన వాత్సవులు రమేష్–అనురాధ దంపతులు విద్యార్థుల కోసం స్కూల్ బ్యాగులు, పలకలు, నోట్‌బుక్స్, షూస్ తదితర 50 వేలు విలువచేసే విద్యా సామగ్రిని అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగర్‌కర్నూల్ ఎంఈఓ కురుమయ్య వారి చేతుల మీదుగా పాఠశాలలో చదువుతున్న 80 మంది పేద విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంఈఓ కురుమయ్య మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం దాతలు ముందుకు వచ్చి సహాయం చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో పాటు సమాజానికి, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటస్వామి ఉపాధ్యాయులు శివ ప్రసాద్, అమరేందర్ రెడ్డి, ఎండి లతీఫ్, సత్యనారాయణ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

NGKL: దాతృత్వం చాటుకున్న దంపతులు.. విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, విద్యా సామగ్రి పంపిణీ

NGKL: దాతృత్వం చాటుకున్న దంపతులు.. విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, విద్యా సామగ్రి పంపిణీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *