Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

“తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వే లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: ప్రజలకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
“తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వే లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: ప్రజలకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపు.

వార్త ముఖ్యాంశాలు

  • నిర్మల్ అక్టోబర్ 21 (పున్నమి ప్రతినిధి) తెలంగాణ రైజింగ్ - 2047 " సిటిజన్ సర్వే లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.
  • తెలంగాణా రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన "తెలంగాణ రైజింగ్ - 2047 " సిటిజన్ సర్వే కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని అన్నారు.
  • ఇప్పటివరకు ఈ సిటిజన్ సర్వే లో కేవలం వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేశారని పేర్కొన్నారు.

నిర్మల్ అక్టోబర్ 21 (పున్నమి ప్రతినిధి)

తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వే లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణా రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వే కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. ఇప్పటివరకు ఈ సిటిజన్ సర్వే లో కేవలం వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేశారని పేర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా, 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుండి తగు సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వేను చేపట్టిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25 వతేదీ తో ముగుస్తుందని తెలిపారు. www.telangana.gov.in /telanganarising అనే వెబ్ సైట్ ను సందర్శించి ప్రతీ ఒక్కరు తమ అమూల్యమైన సలహాలు, సూచనలను పొందుపరచాలని అన్నారు. శక్తివంతమైన తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ఈ ప్రకటనలో కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *