Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎలూరు

వైభవంగా దేవి శరన్నవరాత్రులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వైభవంగా దేవి శరన్నవరాత్రులు

వార్త ముఖ్యాంశాలు

  • వైభవంగా దేవి శరన్నవరాత్రులు ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి మండలంలో కనకదుర్గమ్మ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.
  • బుధవారంఆగిరిపల్లి లోని రుద్రభూమి వద్ద కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు కాత్యాయని దేవిగా దర్శనమిచ్చారు.
  • స్థానిక రజక వీధిలో,వేద పాఠశాలలో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.

వైభవంగా దేవి శరన్నవరాత్రులు
ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి
మండలంలో కనకదుర్గమ్మ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారంఆగిరిపల్లి లోని రుద్రభూమి వద్ద కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు కాత్యాయని దేవిగా దర్శనమిచ్చారు. స్థానిక రజక వీధిలో,వేద పాఠశాలలో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.
ఈదులగూడెం లో వైయస్సార్ సిపి నాయకులు ఈలప్రోలు సుబ్బయ్య, నండూరి భాస్కర్ ప్రసాద్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వట్టిగుడిపాడు లో భక్తులు అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.
గోపాల సుందరీ దేవి గా దర్శనమిచ్చినా అమ్మవారు..

చిన్నాగిరి పల్లి గొల్లగూడెం లోని రేణుక క్షేత్రంలోని కృష్ణదుర్గా అమ్మవారు గోపాల సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. క్షేత్రం వ్యవస్థాపకులు వీర కృష్ణ భవాని భక్తులు అందించిన పసుపు, కుంకుమలను అమ్మవారికి సమర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *