వార్త ముఖ్యాంశాలు
- నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఢిల్లీలో భారీ వర్షాలు కురిశాయి.
- పలు ప్రధాన రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
- కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకూలగా, విద్యుత్ సరఫరా కూడా తాత్కాలికంగా నిలిచిపోయింది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఢిల్లీలో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రధాన రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకూలగా, విద్యుత్ సరఫరా కూడా తాత్కాలికంగా నిలిచిపోయింది. వాతావరణ శాఖ ప్రజలు అవసరమైతే మాత్రమే బయటకు రావాలని సూచించింది. మున్సిపల్ అధికారులు నీటిని తొలగించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.