తెలుగు దిన పత్రిక పున్నమి ✍️✍️
నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో ఆదివారం జాయింట్ కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి… నెల్లూరు జిల్లా (రైతు భరోసా, రెవిన్యూ) ఆర్ అండ్ ఆర్ జాయింట్ కలెక్టర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించిన అనంతరం డి.ఆర్.ఓ, ఆర్.డి.ఓ, కలెక్టరేట్ అధికారులతో జేసీ సమీక్షా, సమావేశం నిర్వహించారు. ఇళ్ల పట్టాల పంపిణీపై సమీక్షించిన జేసీపూర్తి వివరాలతో నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. నూతనంగా విధుల్లో చేరిన వి.ఆర్.ఓ లు.., రెవెన్యూశాఖ చట్టాలపై, విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అవసరం అయితే వారికి శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, మ్యాపింగ్ పై సమీక్ష నిర్వహించారు. ప్రతి రోజూ కోవిడ్-19 ఆపరేషన్స్ కి సంభందించిన సమాచారం నివేదిక రూపంలో తనకు అందజేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ మల్లికార్జున్, ఆర్.డి. ఓ హుస్సేన్ సాహెబ్, కలెక్టరేట్ ఏ.ఓ రామారావు, అధికారులు పాల్గొన్నారు.