పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ
ఏపీలో కరోనా టెస్టుల సంఖ్య రోజురోజుకు పరుగుతోంది.నిన్నటివరకు మొత్తం 1,25,229 కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రతీ 10 లక్షల జనాభాకు 2,345 మందికి టెస్టులు చేస్తున్నారు. రోజు వారీ సామర్ధ్యం 10 వేలకు పైగా పెరిగింది.గత 24 గంటల్లో 10,292 మందికి పరీక్షలు జరిపారు. రాష్ట్రంలో సగటున ప్రతీ 76 టెస్టులకు గానూ ఒక పాజిటివ్ కేసు నమోదవుతోంది .అదే దేశ సగటు చూస్తే ప్రతీ 26 పరీక్షలకు ఒక పాజిటివ్ కేసు వస్తోంది.