కాజీపేట మే (పున్నమి ప్రతినిధి)
*ఆపరేషన్ సిందూర్ వీర సైనికుడి కి*ఘనస్వాగతం*
ఈ రోజు ఉదయం శ్రీ మెట్టుగుట్ట రామాలయం డైరెక్టర్ అయిన గుగులోతు నాగేశ్వరరావు గారి కుమారుడు గుగులోతు రంజిత్ కుమార్ నాయక్ (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) రాజస్థాన్లోని జోద్పూర్ లో గల ఎయిర్ బేస్ నుండి ఆపరేషన్ సింధూర్ లో పాల్గొనీ స్వగ్రామమైన మడికొండకు విచ్చేసిన సందర్భంగా కాజీపేట రైల్వే స్టేషన్ లో ఘనంగా స్వాగతం పలికి పూలమాలవేసి శాలువతో సత్కరించిన మాజీ కార్పొరేటర్ తోట్ల రాజు యాదవ్. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వస్కుల వెంకటస్వామి మెట్టుగుట్ట రామాలయం చైర్మన్ పల్లపు అర్జున్ బైరి లింగమూర్తి వసుకుల శంకర్ సాంబయ్య బాలాజీ జిట్టా చంటి విజయ్ కిషన్ శీను మహేందర్ కుమార్ చట్ట వెంకన్న తదితరులు పాల్గొన్నారు