చిట్వేల్ నవంబర్ 21 పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సయ్యద్ బాబాసాహెబ్ గారి మృతి పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావ కాలం నుంచి ఎన్టీఆర్ నేతృత్వంలోనూ, అనంతరం నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలోనూ పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని నేతలు పేర్కొన్నారు.మరణవార్త తెలిసిన వెంటనే, రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి శుక్రవారం బాబాసాహెబ్ కుటుంబాన్ని ప్రత్యేకంగా పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదారుస్తూ, వారి బాధను పంచుకున్నారు. పార్టీ తరఫున ఎల్లప్పుడూ ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.


