*రన్ ఫర్ యూనిటీ నందు పాల్గొన్న నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు.*
*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
నగరంలోని వుడా చిల్డ్రన్ ఎరీనా కూడలి నుండి సర్క్యూట్ హౌస్ వద్ద గల పటేల్ జంక్షన్ వరకూ నిర్వహించిన ఈ ఐక్యత ర్యాలీ (రన్ ఫర్ యూనిటీ) నందు నగర సీపీ గారు, పోలీసు అధికారులు మరియు సిబ్బంది తో పాల్గొని, అందరిలో ఐక్యత స్ఫూర్తి నింపారు.
పటేల్ జంక్షన్ వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి సీపీ గారు పూలమాల వేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ ఈ రోజు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు అక్టోబర్ 31 రాష్ట్రీయ ఏక్తాదివాస్ గా మనము ఘనంగా జరుపుకుంటున్నాం. మన దేశంలో ప్రతిచోట ఏక్తాదివాస్ ఐక్యతకు గుర్తుగా జరుపుకుంటున్నాం. మనందరికీ తెలుసు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు చూస్తే మన దేశం ఈ పరిస్థితిలో లేనే లేదు హైదరాబాద్, గోవా, కాశ్మీర్ ఇంకా చాలా ప్రెసిడెన్సిలుగా ఉండేవి, వాటి ఏకీకరణ అప్పుడు చాలా కష్టమైన పనిగా ఉన్నా, అప్పటి మన హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పగలు రాత్రి కృషిచేసి, కష్టపడి కొన్నిచోట్ల ఐక్యత కోసం తెలియపరచి, మిలటరీ యాక్షన్ ద్వారా అన్ని ప్రెసిడెన్సీలను ఏకం చేశారు. కాబట్టి కులమత భాషలు ఎన్ని ఉన్నా దేశ ఐక్యత కోసం ఆయన తన జీవితం అంకితం చేశారు. ఈ రోజుకి కూడా ప్రపంచంలోని యూనిటీ అండ్ డైవర్సిటీ కు ప్రతీకగా భారతదేశం ఉంది.
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చూపించిన మార్గం, సందేశం మనందరం గుర్తుపెట్టుకోవాలి. మన పోలీసు వ్యవస్థ కూడా అంత చక్కగా ఉంది అంటే ఆయన ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మనం నడుపుతున్నాం కాబట్టి పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం ఉంది, ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా, ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి, ఐక్యతకు గుర్తుగా ప్రతీకగా తీసుకొని ఈ రోజు ఈ పరుగు ఆయనకు అంకితం, ఆయన చూపించిన మార్గానికి అంకితం. మీరందరూ ఇలాగే ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మన దేశం కోసం ఎటువంటి త్యాగం అయినా చేయడానికి సిద్ధంగా ఉంటారని ఆశిస్తూ ఈరోజు మీ అందరికీ రాష్ట్రీయ ఏక్తాదివాస్ అభినందనలు శుభాకాంక్షలు, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మన విశాఖపట్నం సిటీ పోలీస్ కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను అని తెలిపారు.
అనంతరం నగర సిపి డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు , నగర పోలీసు అధికారులు, సిబ్బందితో దేశ ఐక్యతకు, అంతర్గత భద్రతకు కట్టుబడి ఉంటామని ప్రమాణం చేయించారు.


