అలంపూర్ : ఆగస్టు 17 ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో రఘురామయ్య శెట్టి కొడుకు మృతి చెందడంతో అతని రెండు కళ్ళను దానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచిన కుటుంబాన్ని గ్రామస్తులు అందరూ అభినందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఉండవెల్లి మండల కేంద్రానికి చెందిన నరహరి రఘురామయ్య శెట్టి పెద్ద కుమారుడు నరహరి మురళీకృష్ణ (38) ఈ శనివారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో 3 గంటలకు ఆయాసం వచ్చినట్లు కుటుంబ సభ్యులకు తెలపడంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. శోక సముద్రంలో మునిగిన కుటుంబ సభ్యులందరూ కలసి మృతుడు మురళీకృష్ణ రెండు కళ్ళను దానం చేశారు. అతడు మరణించినా తన అవయవాలు ఇంకొకరికి పునర్జన్మ ఇవ్వాలని సంకల్పంతో కళ్ళను దానం చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మురళీకృష్ణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

నేత్రదానం చేసిన మురళీకృష్ణ.
అలంపూర్ : ఆగస్టు 17 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో రఘురామయ్య శెట్టి కొడుకు మృతి చెందడంతో అతని రెండు కళ్ళను దానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచిన కుటుంబాన్ని గ్రామస్తులు అందరూ అభినందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఉండవెల్లి మండల కేంద్రానికి చెందిన నరహరి రఘురామయ్య శెట్టి పెద్ద కుమారుడు నరహరి మురళీకృష్ణ (38) ఈ శనివారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో 3 గంటలకు ఆయాసం వచ్చినట్లు కుటుంబ సభ్యులకు తెలపడంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. శోక సముద్రంలో మునిగిన కుటుంబ సభ్యులందరూ కలసి మృతుడు మురళీకృష్ణ రెండు కళ్ళను దానం చేశారు. అతడు మరణించినా తన అవయవాలు ఇంకొకరికి పునర్జన్మ ఇవ్వాలని సంకల్పంతో కళ్ళను దానం చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మురళీకృష్ణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

