పున్నమి ప్రతినిధి , తిరుపతి రూరల్
4, 5, తేదీలు బుదవారం, గురువారం ప్రత్యేక పూజలు
శ్రీ విజయ గణపతి స్వామి అనుగ్రహం ఆశీస్సులు పొందండి
MRR ట్రస్ట్ చైర్మన్ యం. మునిరామిరెడ్డి, ఆలయ ధర్మకర్త యం.పుష్ప రెడ్డి
ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవారి సతీమణి శ్రీమతి పద్మావతి అమ్మవారి ఆలయం చెంత తిరుచానూరు నేతాజీ నగర్ లో వెలసిన అత్యంత పవిత్రమైన మహిమగల శ్రీ విజయ గణపతి ఆలయంలో మహా గణపతికి జీర్నోద్ధరణ ఆస్టబంధన కుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుందని MRR ట్రస్టు చైర్మన్ యం. మునిరామిరెడ్డి, మరియు ఆలయ ధర్మకర్త యం. పుష్ప రెడ్డి లు తెలిపారు. శ్రీ విజయ గణపతి ఆలయంలో మహా గణపతికి ఈనెల 4వ తేదీ బుధవారం కలశ స్థాపన పూజలు,5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు కుంభాభిషేకం ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుందని ట్రస్టు సభ్యులు తెలిపారు. 5వ తేదీన గురువారం ఉదయం 11_16 నిమిషాలకు హస్తా నక్షత్రయుక్త వృషభ లగ్నం పుస్కరాంశం సుమూర్తంనందు శ్రీ మహా గణపతికి జీర్నోద్ధరణ ఆస్టబంధన కుంభాభిసేకం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శ్రీ విజయ గణపతి స్వామి వారి ఆలయంలో కలశస్థాపన, కుంభాబిసేకం, గణపతి పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ మండప ఆరాధన హోమాలు, మధ్యాహ్నం ప్రసాదాల వితరణ,అన్నదాన కార్యక్రమాలు జరుగును. ఈ పవిత్రమైన మహిమగల శ్రీ విజయ గణపతి ఆలయంలో మహా గణపతికి జరుగు పూజల్లో పలువురు ప్రముఖులు పార్టీలకు అతీతంగా హాజరు కానున్నారు.భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని శ్రీ విజయ గణపతి స్వామి అనుగ్రహం ఆశీస్సులు పొంది సకల శుభాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుతున్నట్లు శ్రీ విజయ గణపతి ఆలయం నిర్వాహకులు తెలిపారు. ఆలయ అర్చకులు ప్రముఖ శ్రీ మధు స్వామి ఆధ్వర్యంలో శ్రీ విజయ గణపతి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.మధు స్వామి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ప్రభుత్వం తరుపు ప్రత్యేక హోమాలు,భూమి పూజ కార్యక్రమాలు,అదే విధంగా నేటి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాంటి ప్రముఖ అర్చకులు మధు స్వామి ఆధ్వర్యంలో 4 ,5 తారీఖులలో కుంభాభిషేక మహోత్సవం జరుగనుంది.శ్రీ విజయ గణపతి ఆలయంలో పర్వదినాల్లో ,సంకష్ట హరచతుర్థి ప్రత్యేక పూజలు కూడా మధు స్వామి నిర్వహించడం విశేషం.ఎన్నో విశేష ,ప్రత్యేకతలు కలిగిన శ్రీ విజయ గణపతి ఆలయాన్ని చూసినవారు తన్మయత్నం చెందడం ఖాయమని,తప్పకుండా ప్రతీ ఒక్కరూ ఒకసారి ఐనా శ్రీ విజయ గణపతి స్వామి వారిని దర్శించుకుని అన్ని విజయాలు పొందాలని కోరారు.

