Tuesday, 24 March 2026
  • Home  
  • జ్యోతిర్గమయ మిషన్ కింద 20 మంది ట్రాన్స్‌జెండర్లకు జీవీఎంసీ పొరుగుసేవల
- విశాఖపట్నం

జ్యోతిర్గమయ మిషన్ కింద 20 మంది ట్రాన్స్‌జెండర్లకు జీవీఎంసీ పొరుగుసేవల

జ్యోతిర్గమయ మిషన్ కింద 20 మంది ట్రాన్స్‌జెండర్లకు జీవీఎంసీ పొరుగుసేవల నియామక పత్రాలు. * ట్రాంజెండర్స్ గౌరవప్రదమైన జీవితం గడపాలి . *విశాఖపట్నం డిసెంబర్ 27పున్నమి ప్రతినిధి * విశాఖ నగరంలో గల ట్రాన్స్ జెండర్లు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి పొరుగు సేవల ద్వారా సుముఖ స్థానం కల్పిస్తున్నారని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం అయిన పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నగరంలోని 20 మంది ట్రాన్స్ జెండర్స్ కు జీవీఎంసీ పొరుగు సేవల పారిశుద్ధ్య కార్మికులుగా నియమామక పత్రాలను శంఖబ్రత భాగ్చి తో కలిసి అందించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ట్రాంజెండర్స్ గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. నగరంలో ఉన్న ట్రాంజెండర్స్ భిక్షాటన కాకుండా గౌరవం ప్రియతమైన జీవనాన్ని గడిపేందుకు వారికి ఉద్యోగాలు కల్పిస్తూ పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్ చొరవతో 20 మంది ట్రాన్స్ జెండర్లకు మిషన్ జ్యోతిర్గమయ ద్వారా పొరుగు సేవl పద్ధతిలో పారిశుద్ధ్య కార్మికులుగా నియమిస్తూ నియామక పత్రాలను అందించడం జరిగిందని తెలిపారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లను అందరిలో గౌరవప్రదంగా ఉండేలా గౌరవప్రదమైన జీవితం జీవించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు భిక్షాటన , వివాదాలకు జోలికి పోకుండా గౌరవప్రదంగా బతకాలని ఆయన తెలిపారు. నగర మేయర్, జీవీఎంసీ కమిషనర్, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి కృషితో 20 మందికి పొరుగు సేవల పద్ధతిలో జీవీఎంసీ పారిశుధ్య కార్మికులుగా ఉద్యోగ కల్పించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ సహాయ వైద్యాధికారి, ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు

జ్యోతిర్గమయ మిషన్ కింద 20 మంది ట్రాన్స్‌జెండర్లకు జీవీఎంసీ పొరుగుసేవల నియామక పత్రాలు.

* ట్రాంజెండర్స్ గౌరవప్రదమైన జీవితం గడపాలి .

*విశాఖపట్నం డిసెంబర్ 27పున్నమి ప్రతినిధి * విశాఖ నగరంలో గల ట్రాన్స్ జెండర్లు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి పొరుగు సేవల ద్వారా సుముఖ స్థానం కల్పిస్తున్నారని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు.
శనివారం అయిన పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నగరంలోని 20 మంది ట్రాన్స్ జెండర్స్ కు జీవీఎంసీ పొరుగు సేవల పారిశుద్ధ్య కార్మికులుగా నియమామక పత్రాలను శంఖబ్రత భాగ్చి తో కలిసి అందించారు.

ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ట్రాంజెండర్స్ గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. నగరంలో ఉన్న ట్రాంజెండర్స్ భిక్షాటన కాకుండా గౌరవం ప్రియతమైన జీవనాన్ని గడిపేందుకు వారికి ఉద్యోగాలు కల్పిస్తూ పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్ చొరవతో 20 మంది ట్రాన్స్ జెండర్లకు మిషన్ జ్యోతిర్గమయ ద్వారా పొరుగు సేవl పద్ధతిలో పారిశుద్ధ్య కార్మికులుగా నియమిస్తూ నియామక పత్రాలను అందించడం జరిగిందని తెలిపారు.

అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లను అందరిలో గౌరవప్రదంగా ఉండేలా గౌరవప్రదమైన జీవితం జీవించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు భిక్షాటన , వివాదాలకు జోలికి పోకుండా గౌరవప్రదంగా బతకాలని ఆయన తెలిపారు. నగర మేయర్, జీవీఎంసీ కమిషనర్, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి కృషితో 20 మందికి పొరుగు సేవల పద్ధతిలో జీవీఎంసీ పారిశుధ్య కార్మికులుగా ఉద్యోగ కల్పించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జీవీఎంసీ సహాయ వైద్యాధికారి, ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.