వంగూర్ మండలం డిండి చింతపల్లి వాగు నుంచి అనుమతులు ఉన్నాయన్న సాకుతో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని బిజెపి మండల అధ్యక్షుడు గున్నా ఆనంద్ రెడ్డి బుధవారం ఆరోపించారు. వంగూర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, రోజు 20 ట్రాక్టర్ల ఇసుక రవాణాకు అనుమతి తీసుకుని రోజు 200 ట్రాక్టర్ల అక్రమంగా రవాణా చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుకను ఇవ్వడం లేదన్నారు. కేవలం నాయకుల లాభం కోసమే అధికారులు ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇసుక పర్మిషన్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ ఇసుక రవాణా ఆపకపోతే బిజెపి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సిలువేరు సైదులు, ఇంత కుంట్ల సైదులు, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి