ZPHS కొడకండ్లలో నిర్వహించిన మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ (CMSTT) లో ZPHS ఏడునూతుల విద్యార్థులు ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచారు.
ఈ పోటీలో పాల్గొని జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనవారు:
నూతనగంటి దుర్గ వర్షిత (10వ తరగతి)
బోనగిరి మానస (9వ తరగతి)
రాసాల అభినయ్ (8వ తరగతి)
ఈ ముగ్గురు విద్యార్థులు 28-11-2025న జిల్లా స్థాయిలో కూడా మా పాఠశాల ప్రతిష్ట పెంచాలని ఆశిస్తూ, ZPHS ఏడునూతుల బోధనా సిబ్బంది అందరూ వారిని అభినందించారు.
ప్రధానోపాధ్యాయులు నారబోయిన యాకయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమల్ కుమార్, రాంబాబు, ఈర్య, సోమేశ్వర్, ఎం.రజిత, యాదగిరి, విజయ, కవిత, భాస్కర్, విజయశ్రీ పాల్గొన్నారు.


