ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ

Tag: East Godavari District

తూర్పు గోదావరి

వర్షాలు సమృద్ధిగా కురవాలని బిక్కవోలులో వరుణయాగం

బిక్కవోలు, అక్టోబరు 6 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు శ్రీ లక్ష్మీగణపతి ఆలయంలో మంగళవారం వరుణయాగం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో చేపట్టిన వరుణయాగంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డితో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వరుణదేవుడి కరుణ కోసం వరుణయాగాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఎల్‌నినో ప్రభావం తగ్గి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసిందన్నారు. నవంబరు, డిసెంబరు నెలల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులను రాజకీయాలకు అతీతంగా ఎదుర్కొని ప్రజల సంక్షేమానికి సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఎల్‌నినో ప్రభావం నుంచి ప్రజలు బయటపడాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుణదేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

తూర్పు గోదావరి

60 మంది దివ్యాంగులు, వృద్ధులకు అన్నదానం

రాజమహేంద్రవరం రూరల్, అక్టోబరు 5 (పున్నమి ప్రతినిధి): ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ఎన్జీవో బిక్కవోలు మండల శాఖ ఆధ్వర్యంలో బిక్కవోలు గ్రామానికి చెందిన చోడవరపు కుటుంబ సభ్యులు మానవీయ సేవా కార్యక్రమం నిర్వహించారు. దివంగత చోడవరపు కూటయ్య, శ్రీమతి అమ్మాజీ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు, కోడళ్లు చోడవరపు రాంబాబు–సత్యవతి దంపతులు, చోడవరపు లోవరాజు–కుమారి దంపతులు సోమవారం రాజమండ్రి రూరల్ నామవరంలోని మానవీయ ఐక్య సేవా అసోసియేషన్ ఆశ్రమంలో 60 మంది దివ్యాంగులు, వృద్ధులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు, చైర్మన్ టి. శ్రీనివాసరావు, ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెదపాటి విష్ణు, బిక్కవోలు మండల శాఖ అధ్యక్షులు సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు, శ్రీమతి మణికుమారి, అయితిరెడ్డి అయ్యప్ప, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. అన్నదానం చేసిన చోడవరపు కుటుంబ సభ్యులకు ఆశ్రమ నిర్వాహకులు, దివ్యాంగులు, వృద్ధులు కృతజ్ఞతలు తెలిపారు. తమ పట్ల ఆప్యాయతతో అన్నదానం చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దివంగతుల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

తూర్పు గోదావరి

అనపర్తికి జలజీవన్ మిషన్ కింద రూ.75.60 కోట్లు

బిక్కవోలు, అక్టోబరు 5 (పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గంలో జలజీవన్ మిషన్ కింద ఇప్పటివరకు రూ.75.60 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. బిక్కవోలులో జలజీవన్ మిషన్ పనులకు ఎమ్మెల్యే నల్లమిల్లి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి, కూటమి నాయకులు శంకుస్థాపన, భూమిపూజ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే 33 పనులకు రూ.58.25 కోట్లు ఖర్చవుతుండగా, తాజాగా మరో 25 పనులకు రూ.17.35 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ నిధులను సద్వినియోగం చేయకపోవడం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందన్నారు. రంగంపేట మండలానికి తాగునీటి కోసం త్వరలో జలజీవన్ మిషన్ కింద నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మండలానికి సంబంధించి రూ.42 కోట్ల ప్రతిపాదనలు పంపించామని, గ్రిడ్ ద్వారా కూడా తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, బిక్కవోలు మండల, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

వైసీపీ నేతలకు సుబ్బారెడ్డి సవాల్‌

చెరువులు, కాలువలపై ముఖాముఖి చర్చకు సిద్ధమని వెల్లడి బలభద్రపురం, అక్టోబరు 3 (పున్నమి ప్రతినిధి): బలభద్రపురం గ్రామంలోని చెరువులు, కాలువలు, ముంపు సమస్యపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలకు టీడీపీ నాయకుడు సుబ్బారెడ్డి స్పందించారు. సంత మార్కెట్‌ వద్ద ఉన్న ఊరచెరువును పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపవరం వెదుళ్ల చెరువు నుంచి మిగులు నీరు కలింగల ద్వారా ఊరచెరువులోకి చేరి, అక్కడి తూము, సుమారు 12 అడుగుల బోధి ద్వారా దిగువ ప్రాంతాలకు వెళ్లే సహజ నీటి ప్రవాహ వ్యవస్థ గతంలో ఉండేదని తెలిపారు. వాకింగ్‌ ట్రాక్‌ పేరుతో చెరువు చుట్టూ నిర్మాణాలు చేపట్టి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో మార్గాలకు తగిన తూములు ఏర్పాటు చేయకపోవడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడిందని ఆరోపించారు. 2013 నీలం తుఫాను సమయంలో బలభద్రపురం గ్రామంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, 2014లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సుమారు రూ.30 లక్షలతో కాలువ పనులు చేపట్టి నీటిని గోదావరి కాలువలోకి మళ్లించే ఏర్పాట్లు చేసినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. గీతా మందిరం వెనుక ఉన్న 12 అడుగుల బోధి, కాలువలు, పుంతల పరిస్థితిపై రికార్డులతో సహా చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మాజీ సర్పంచ్‌ కర్రి సత్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ వీరరాఘవరెడ్డితో పాటు వైసీపీ నాయకులు ముఖాముఖి చర్చకు రావాలని సవాల్‌ చేశారు. మత్స్యకార కుటుంబాలు నిర్మించిన బండకు సంబంధించి తాము ఎలాంటి బిల్లులు తీసుకోలేదని స్పష్టం చేసిన సుబ్బారెడ్డి.. తాము బిల్లులు తీసుకున్నట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ చేశారు. అదే విధంగా ప్రభుత్వం ఇచ్చిన పట్టాల పరిమితిని మించి నిర్మాణాలు చేపట్టలేదని వైసీపీ నాయకులు నిరూపించాలని కోరారు. చెరువులు, కాలువలపై రాజకీయ ఆరోపణలకు బదులుగా రికార్డుల ఆధారంగా వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఆయన అన్నారు.

తూర్పు గోదావరి

వైసీపీ నేతలకు సుబ్బారెడ్డి సవాల్‌

బలభద్రపురం, అక్టోబరు 3 (పున్నమి ప్రతినిధి): గ్రామంలోని చెరువులు, కాలువలు, ముంపు సమస్యపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలకు సుబ్బారెడ్డి స్పందించారు. వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణంతో ఊరచెరువుకు నీటి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో మార్గాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. 2014లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సుమారు రూ.30 లక్షలతో ముంపు నివారణ కాలువ పనులు చేపట్టినట్లు తెలిపారు. 12 అడుగుల బోధి, కాలువలపై రికార్డులతో ముఖాముఖి చర్చకు సిద్ధమన్నారు. బండ నిర్మాణానికి తాము బిల్లులు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వైసీపీ నేతలకు సవాల్‌ విసిరారు.

తూర్పు గోదావరి

స్వచ్ఛతే సంకల్పం.. పరిశుభ్రతే లక్ష్యం

స్వచ్ఛత కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి అనపర్తి, అక్టోబరు 3 (పున్నమి ప్రతినిధి): ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న “స్వచ్ఛ సంకల్ప అభియాన్”లో భాగంగా అనపర్తి ప్రెస్‌క్లబ్ ప్రాంతంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రోడ్లను శుభ్రపరిచారు. బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రామ్‌కుమార్, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం కృషి చేయాలని కోరారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో, తహసీల్దార్‌తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

వైద్య సహాయానికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

అరికరేవుల, అక్టోబరు 2 (పున్నమి ప్రతినిధి): అరికరేవుల గ్రామానికి చెందిన సుందరినిడి వెంకటేష్‌ వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి మంజూరైన రూ.42,000 విలువైన చెక్కును అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. అనపర్తి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావుతో కలిసి వెంకటేష్‌ కుటుంబ సభ్యులకు చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

హర్షిత పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం

గుంటూరు, అక్టోబరు 1 (పున్నమి ప్రతినిధి): తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం కేశవరం గ్రామానికి చెందిన గారపాటి శ్రీనివాస్‌, తులసి దంపతుల కుమార్తె హర్షిత పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలోని నల్లపాడులో ఉన్న క్షేమంకరి వృద్ధాశ్రమంలో మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు భోజనం వడ్డించారు. సేవా కార్యక్రమానికి సహకరించిన దాతలకు వృద్ధాశ్రమం నిర్వాహకులు, సిబ్బంది, వృద్ధులు కృతజ్ఞతలు తెలిపారు.

తూర్పు గోదావరి

జ్ఞాపకార్థం వృద్ధాశ్రమంలో అన్నదానం

పర్చూరు, సెప్టెంబరు 29 (పున్నమి ప్రతినిధి): తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం కేశవరం గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ఉపాధ్యక్షులు ఉండమట్ల వీరబాబు తండ్రి కీ.శే. ఉండమట్ల సత్యనారాయణ, తాతయ్య కీ.శే. ఉండమట్ల సూర్యారావు, నాయనమ్మ శ్రీమతి గోవిందమ్మ, చిన్నాన్న కీ.శే. ఉండమట్ల కామేశ్వరరావు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల సహకారంతో పర్చూరులోని ఆశ్రయ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు భోజనం వడ్డించారు. తమ కుటుంబ పెద్దల జ్ఞాపకార్థం వృద్ధులకు అన్నదానం చేయడం ద్వారా వారి జ్ఞాపకాలను సేవా కార్యక్రమంగా కొనసాగిస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన కుటుంబ సభ్యులకు ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

తూర్పు గోదావరి

చికిత్స పొందుతూ యువకుడి మృతి

విషాదంలోనూ నేత్రదానం చేసిన తల్లిదండ్రులు బిక్కవోలు, సెప్టెంబరు 29 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు కొత్తపేటకు చెందిన కల్లేపల్లి శివరామకృష్ణ (26) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నెల 21న గోకవరంలో శుభకార్యానికి వంట పనికి వెళ్లిన శివరామకృష్ణ, 23న రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా బలభద్రపురం–కానేడు రోడ్డుపై తుఫాన్‌ కారణంగా మోటార్‌బైక్‌ అదుపుతప్పి జారిపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా అనపర్తి ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కుమారుడి మృతితో విషాదంలో ఉన్న తల్లిదండ్రులు మానవత్వాన్ని చాటుతూ అతడి రెండు నేత్రాలను లకంసాని విరీన్ మానస్ రెడ్‌క్రాస్ ‘ఐ’ బ్యాంక్‌, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, కాకినాడకు దానం చేశారు. ఈ నేత్రాలను ఇద్దరు అంధులకు చూపు అందించేందుకు వినియోగించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నేత్రదానానికి ముందుకొచ్చిన తల్లిదండ్రుల నిర్ణయాన్ని స్థానికులు అభినందించారు.