ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
കിഴക്കൻ ഗോദാവരി

అనపర్తికి జలజీవన్ మిషన్ కింద రూ.75.60 కోట్లు

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്: പുതുക്കിയത്:
అనపర్తికి జలజీవన్ మిషన్ కింద రూ.75.60 కోట్లు

బిక్కవోలు, అక్టోబరు 5 (పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గంలో జలజీవన్ మిషన్ కింద ఇప్పటివరకు రూ.75.60 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. బిక్కవోలులో జలజీవన్ మిషన్ పనులకు ఎమ్మెల్యే నల్లమిల్లి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి, కూటమి నాయకులు శంకుస్థాపన, భూమిపూజ నిర్వహించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే 33 పనులకు రూ.58.25 కోట్లు ఖర్చవుతుండగా, తాజాగా మరో 25 పనులకు రూ.17.35 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ నిధులను సద్వినియోగం చేయకపోవడం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందన్నారు.

రంగంపేట మండలానికి తాగునీటి కోసం త్వరలో జలజీవన్ మిషన్ కింద నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మండలానికి సంబంధించి రూ.42 కోట్ల ప్రతిపాదనలు పంపించామని, గ్రిడ్ ద్వారా కూడా తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, బిక్కవోలు మండల, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

అనపర్తికి జలజీవన్ మిషన్ కింద రూ.75.60 కోట్లు

అనపర్తికి జలజీవన్ మిషన్ కింద రూ.75.60 కోట్లు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *