எங்களை தொடர்புகொள்ள சமீபத்திய செய்திகள்
உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்

Tag: స్టేషన్ ఘన్‌పూర్

జనగాం

సముద్రాలలో అస్తవ్యస్తంగా మోరీలు.. ఇళ్లలోకి వెళ్లలేని దుస్థితి

​జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో వర్షాలు కురిస్తే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. మురుగు నీరు నిలవడంతో ఇళ్లలోకి వెళ్లేందుకు వీలులేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసన, దోమలతో అనారోగ్యాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

జనగాం

కెనాల్ మెజర్మెంట్లు తొలగింపు! సముద్రాల సూరారం రైతుల ఇబ్బందులు!

స్టేషన్ ఘన్‌పూర్ రిజర్వాయర్ మెయిన్ కెనాల్ నుండి ఇప్పగూడెం ఎల్-2 కెనాల్‌ ద్వారా సముద్రాల సూరారంకు రావాల్సిన నీరు మెజర్మెంట్లు తొలగించడం వల్ల. నీరు సరిగ్గా రాకపోవడంతో సముద్రాల సూరారం గ్రామ రైతులు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంవత్సరం కాలం కాక వేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. Uploaded Video: