உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்
அனகாப்பள்ளி

కార్యకర్తలకు ఐడీ కార్డులు.. పార్టీ బలోపేతమే లక్ష్యం

புன்னமி செய்தியறை வெளியீடு: புதுப்பிப்பு:
కార్యకర్తలకు ఐడీ కార్డులు.. పార్టీ బలోపేతమే లక్ష్యం

செய்தியின் முக்கிய அம்சங்கள்

  • పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) అచ్యుతాపురం, అక్టోబర్ 6: ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆదేశాల మేరకు అచ్యుతాపురం మండల పార్టీ అధ్యక్షులు దేశంశెట్టి శంకరరావు ఆధ్వర్యంలో మోసయ్యపేట, ఆవ సోమవారం, మడుతూరు గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐడీ కార్డుల పంపిణీ…
  • ఈ సందర్భంగా దేశంశెట్టి శంకరరావు మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులు అందించడం ద్వారా పార్టీ కార్యక్రమాల్లో సమన్వయం మరింత మెరుగుపడుతుందని తెలిపారు.
  • రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి కోన బుజ్జి మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించాలని అన్నారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )

అచ్యుతాపురం, అక్టోబర్ 6: ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆదేశాల మేరకు అచ్యుతాపురం మండల పార్టీ అధ్యక్షులు దేశంశెట్టి శంకరరావు ఆధ్వర్యంలో మోసయ్యపేట, ఆవ సోమవారం, మడుతూరు గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంశెట్టి శంకరరావు మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులు అందించడం ద్వారా పార్టీ కార్యక్రమాల్లో సమన్వయం మరింత మెరుగుపడుతుందని తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి కోన బుజ్జి మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించాలని అన్నారు. రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లాలం రాంబాబు మాట్లాడుతూ ఐడీ కార్డుల పంపిణీతో పార్టీ సంస్థాగత కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా యాక్టివిటీస్ సెక్రెటరీ ఈత బాబురావు, బలిరెడ్డి శ్రీను, మోటారు సంజీవి, మాజీ ఎంపీటీసీ జువ్వల నాయుడు, తోట వెంకటేష్, కొల్ల అప్పలరాజు, సత్యనారాయణ, రాజబాబు, మల్లపు రెడ్డి శ్రీను, పంచదారల పైడిరాజు, శెట్టి గోపి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *