உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்

Tag: అనకాపల్లి జిల్లా

అనకాపల్లి

బైక్ చోరీ కేసును ఛేదించిన టౌన్ పోలీసులు

ఇద్దరు నిందితుల అరెస్ట్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ స్వాధీనం అనకాపల్లి పట్టణంలో జరిగిన బైక్ చోరీ కేసును టౌన్ పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, చోరీకి గురైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు సీఐ జి.ప్రేమ్ కుమార్ పర్యవేక్షణలో ఎస్ఐ ఎ.వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. గత సెప్టెంబర్ 21న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వెనుక పార్క్ చేసిన AP39 QY 5309 నంబర్ గల క్రోమ్ రెడ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను సిద్ధాంతపు హరీష్ అలియాస్ హనోక్ (24), పెద్దసింగ్ రేవంత్ అలియాస్ సాయి (22) చోరీ చేసినట్లు గుర్తించారు. బుధవారం విశ్వసనీయ సమాచారంతో కొత్తూరు జంక్షన్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన ఎస్ఐ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

అనకాపల్లి

ముదిరిన నారుతో నాట్లు.. రైతులకు అధికారుల సూచనలు

యలమంచిలి మండలంలో ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులు నిండడంతో రైతులు సాగు పనులను వేగవంతం చేశారు. పులపర్తి గ్రామంలో మల్లపరెడ్డి గోవింద్ పొలంలో వరి నాట్లు వేసే విధానాన్ని మండల వ్యవసాయ అధికారి మోహన్‌రావు పరిశీలించారు. సుమారు 65 రోజుల ముదిరిన నారును నాటే సమయంలో మొక్కలను దగ్గరగా నాటుకోవాలని సూచించారు. ఎకరాకు అదనంగా 25 కిలోల యూరియా వినియోగించాలని తెలిపారు. దోమ, పొడ తెగుళ్ల నివారణకు ఎసిఫేట్, హెక్సాకొనజోల్ మందులను ప్రాథమిక దశలోనే పిచికారీ చేయాలన్నారు. పంట వేయని భూముల్లో రాగులు, జనుము, ఉలవల విత్తనాలను 80 శాతం రాయితీపై రైతు సేవా కేంద్రాల్లో అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయకురాలు హేమ, ఏపీ సీ.ఎన్.ఎఫ్ సిబ్బంది వనజ, నాయుడు పాల్గొన్నారు.

అనకాపల్లి

పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

పల్లె పండుగ 3.0′ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. బుధవారం యలమంచిలి మండలంలోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మండలంలోని 11 గ్రామ పంచాయతీల పరిధిలో సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణానికి గానూ మొత్తం 40 అభివృద్ధి పనులు మంజూరయ్యాయని తెలిపారు. వీటి నిర్మాణానికి రూ. 3.82 కోట్ల అంచనా వ్యయాన్ని కేటాయించినట్లు వెల్లడించారు. ​గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం వల్ల ప్రజల రవాణా కష్టాలు తీరుతాయని ఆయన పేర్కొన్నారు. పల్లెల్లో అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా సమకూరుస్తూ, గ్రామాల సర్వాంగీణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ​ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు, యువకులు మరియు కూటమి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

అనకాపల్లి

​కొత్తూరు గ్రామంలో బిన్ బ్యాగ్ నిర్వహణపై ఆకస్మిక తనిఖీ నిర్వహించిన అధికారులు

యలమంచిలి మండలంలోని కొత్తూరు గ్రామంలో బిన్ బ్యాగ్ నిర్వహణ తీరుపై మంగళవారం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎంపీడీఓ (ఎఫ్ఎసీ) వి.దీపిక, పంచాయతీ విస్తరణ అధికారి గిరిప్రసాద్‌ ల ఆధ్వర్యంలో అధికారులు గ్రామంలో ఇంటింటికీ తిరిగి బిన్ బ్యాగ్ విధానం అమలు అమలవుతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ​ఈ సందర్భంగా పలువురు గృహ యజమానులతో మాట్లాడి చెత్త సేకరణ, నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులు బిన్ బ్యాగ్ విధానాన్ని క్రమం తప్పకుండా పాటిస్తుండటంపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ​ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనివాస్, స్థానిక సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అనకాపల్లి

ప్రజల సమస్యల పరిష్కారం కోసమే జనవాణి కార్యక్రమం..

యలమంచిలి :ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ‘జనవాణి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ ప్రజల నుంచి నేరుగా వినతులు, అర్జీలను స్వీకరించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల అర్జీలపై తక్షణమే స్పందించిన ఆయన, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

అనకాపల్లి

వైఎస్సార్ కార్డుల పంపిణీలో రాజాన సంజీవ్, మాసవరపు కాసుబాబు

అచ్యుతాపురం, అక్టోబర్ 7: అచ్యుతాపురం మండలం వైఎస్సార్ నగర్ పూడి కాలనీలో బుధవారం వైఎస్సార్ కుటుంబ సభ్యులకు వైఎస్సార్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆదేశాల మేరకు పార్టీ నేతలు దేశం శెట్టి శంకర్రావు, లాలం రాంబాబు, కోనా బుజ్జి ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయాలు, సంక్షేమ విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని వైఎస్సార్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రాజాన సంజీవ్, యూత్ ప్రెసిడెంట్ మాసవరపు కాసుబాబు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ఐక్యంగా, చురుగ్గా పనిచేయాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

అనకాపల్లి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. జనవాణిలో వినతుల స్వీకరణ

: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హాజరై వ్యక్తిగత, గ్రామీణ, మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వినతిని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. పరిష్కారానికి అవసరమైన చర్యలను తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడకుండా వీలైనంత త్వరగా సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారం చూపడమే జనవాణి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

అనకాపల్లి

ప్రతి ఇంటిపై సూర్యశక్తి.. విద్యుత్ బిల్లులకు ఆదా

సూర్య ఘర్ యోజనను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ యలమంచిలి: ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఇళ్లపై సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సూర్యశక్తిని వినియోగించడం ద్వారా విద్యుత్ ఖర్చును తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి కుటుంబం భాగస్వామి కావాలని సూచించారు. అర్హత కలిగిన గృహ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్నందున ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఇళ్లపై పడే సూర్యకాంతిని విద్యుత్తుగా మార్చుకుని అవసరాలకు తామే విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. యలమంచిలి నియోజకవర్గాన్ని సోలార్ వినియోగంలో ముందంజలో నిలిపేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

అనకాపల్లి

నునపర్తిలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

పల్లె పండుగ 3.0లో భాగంగా అభివృద్ధి పనులకు శ్రీకారం పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా నునపర్తి గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలోని శ్మశానవాటికకు సుమారు రూ.15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ బుధవారం శంకుస్థాపన చేశారు. కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నునపర్తి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, సెక్రటరీ మధు, మాజీ సర్పంచ్ అనురాధ, మాజీ ఎంపీటీసీ వెన్నెల అప్పలనాయుడు, జనసేన నాయకులు రెడ్డి రాజేష్, వర్రి పేరునాయుడు, చుక్క కృష్ణ, బి.శ్రీను, నూకరాజు, పైల అప్పారావు, బి.రాము, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

అనకాపల్లి

కార్యకర్తలే వైఎస్సార్‌సీపీకి బలమైన పునాది

పార్టీ శ్రేణులకు ఐడీ కార్డుల పంపిణీ వైఎస్సార్‌సీపీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అచ్యుతాపురం మండల పార్టీ అధ్యక్షులు దేశంశెట్టి శంకరరావు పిలుపునిచ్చారు. ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆదేశాల మేరకు గోర్లీ ధర్మవరం, వెదురువాడ ఆర్‌అండ్‌ఆర్ కాలనీ (వైఎస్సార్ నగర్)లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి వెన్నెముకని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వారికి అందుబాటులో ఉండాలని సూచించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి కోన బుజ్జి మాట్లాడుతూ ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లాలం రాంబాబు మాట్లాడుతూ ఐక్యతతో పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చేకూరి శ్రీను వాసరాజు, చేపల శ్రీరాములు, గంగూలీ శ్రీను, పుర్రె సన్యాసిరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.