संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: విశాఖపట్నం పున్నమి న్యూస్

విశాఖపట్నం

*స్టీల్ యాజమాన్యం దసరాకు ముందే SAIL కార్మికులకు ఇచ్చిన విధంగా బోనస్ చెల్లించాలి మరియు VRS పెట్టిన కార్మికుల పెండింగ్ బకాయిలు తక్షణమే చెల్లించాలి – బొండా యల్లాజీరావు, DSEU జనరల్ సెక్రటరీ

విశాఖ ఉక్కు కార్మికులు సమయానికి జీతాలు లేకపోయినా, ఎటువంటి సౌకర్యాలకు నోచుకోకపోయినా, సరైన భోజనం, క్యాంటీన్లు లేకపోయినా, ఆసుపత్రిలో సౌకర్యాలు లేకపోయినా, అదే విధంగా సేఫ్టీ పరికరాలు లేకపోయినా, కార్మికుల సంఖ్య మూడు రెట్లు తగ్గిపోయినా “దినదినగండం – నూరేళ్ల ఆయుషు” అనే చందంగా చెమటోడ్చి కష్టపడి ఉత్పత్తి, ఉత్పాదకతలో రికార్డులు సృష్టిస్తున్న స్టీల్ కార్మికులకు యాజమాన్యం తీరని అన్యాయం చేస్తోందని DSEU జనరల్ సెక్రటరీ బొండా యల్లాజీరావు అన్నారు. కనీసం దసరా పండుగ ముందైనా SAIL కార్మికులకు ఇస్తున్న విధంగా బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా VRS తీసుకున్న కార్మికులకు బకాయి సొమ్మును వెంటనే చెల్లించాలని కోరారు. కార్మికుల సహనాన్ని పరీక్షించకుండా యాజమాన్యం చర్యలు చేపట్టాలని, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువచ్చి కార్మికుల మనోభావాలను కాపాడి, ప్లాంట్ పురోభివృద్ధికి చర్యలు చేపట్టాలని అన్నారు. లేకుంటే జరిగే పరిణామాలకు యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. *- బొండా యల్లాజీరావు* *జనరల్ సెక్రటరీ, DSEU*

విశాఖపట్నం

విశాఖ ఉక్కు పరిరక్షణకు “ఉక్కు విలీన దీక్ష” – 100 గంటల దీక్ష ప్రారంభం

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, RINL పరిరక్షణ కోసం స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ (SEA) ఆధ్వర్యంలో 100 గంటల “ఉక్కు విలీన దీక్ష” ప్రారంభమైంది. *”TO KEEP THE STEEL SECTOR IN THE STRATEGIC SECTOR and MERGER OF SAIL, RINL, NSL & MECON”* అనే ప్రధాన డిమాండ్ తో ఈ దీక్ష చేపట్టారు. *SEA భవన్ లో* అక్టోబర్ 2వ తేదీ ఉదయం 8 గంటల నుండి అక్టోబర్ 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు 100 గంటల పాటు ఈ దీక్ష కొనసాగనుంది. *ప్రధాన డిమాండ్లు:* 1. స్టీల్ రంగాన్ని వ్యూహాత్మక రంగంలోనే కొనసాగించాలి, SAIL, RINL, NSL & MECON లను విలీనం చేయాలి. 2. కోక్ ఓవెన్ బ్యాటరీలకు తక్షణమే రూ. 3,000 కోట్ల సహాయం అందించాలి. 3. వినియోగించే ప్రతి టన్ను ఇనుప ఖనిజంపై రూ. 3,000 సబ్సిడీ ఇవ్వాలి. 4. పెండింగ్ వేతనాలు, నేషనల్ ప్రమోషన్లు, 2020-21, 2021-22 PRP విడుదల, VRS చెల్లింపులు, అధిక పింఛన్ కోసం డిమాండ్ లెటర్ల పునఃజారీ, గ్రాట్యుటీని రూ. 25 లక్షలకు పెంచడం, రిటైరైన ఉద్యోగులకు పాత GMIS కొనసాగింపు. ఈ దీక్షకు RINL ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి (డ్యూటీ సమయం తర్వాత) పాల్గొని మద్దతు తెలపాలని SEA నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో SEA ప్రతినిధులు, వివిధ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ప్రతి ఊరికి సంక్షేమ భరోసా సంఘం – అన్నవరప్పాడు సదస్సులో కర్రి వెంకటరమణ పిలుపు*

పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలం అన్నవరప్పాడులో పొప్పాపు నాగేశ్వరరావు, పొప్పాపు సూర్య నాగేశ్వరరావు గార్ల ఆధ్వర్యంలో సంక్షేమ భరోసా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు శ్రీ కృష్ణదేవరాయ సంక్షేమ భరోసా కేంద్రాల వ్యవస్థాపకులు *కర్రి వెంకటరమణ*, సావిత్రిబాయి పూలే మహిళా సంక్షేమ భరోసా సంఘం అధ్యక్షురాలు *కేశవభట్ల వాణిశ్రీ*, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ అసోసియేట్స్ *నడిగెట్ల శేషు, నరసా శేషు, ప్రసాద్* ముఖ్య అతిథులుగా హాజరై మహిళల సంక్షేమానికి సంబంధించిన ఐక్యత, అభివృద్ధి, సంక్షేమం, భద్రత అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా భరోసా కేంద్రాల వ్యవస్థాపకులు కర్రి వెంకటరమణ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, దానికి కావలసిన అవగాహన, సహాయ సహకారాలు, స్వయం ఉపాధికి సంబంధించిన సహకారం కోసం ఉత్సాహం ఉన్న మహిళలు గ్రూపులుగా ఏర్పడి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిళలకు స్వయం ఉపాధికి సంబంధించిన నైపుణ్య శిక్షణలు – జ్యూట్ బ్యాగుల తయారీ, కుట్టు శిక్షణ, బ్యూటీపార్లర్ కోర్సులు, అలాగే డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా హోమ్ కేర్, పర్సనల్ కేర్, హెల్త్ కేర్ తదితర ఉత్పత్తుల విక్రయం ద్వారా ఆదాయ మార్గాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ సమాజంలో నిజాయితీగా జీవిస్తూ అభివృద్ధి చెందాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పిండి మారయ్య, లీల గార్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పి. నాగేశ్వరరావు, రంగనీడి గంగాధర్, సూర్య నాగేశ్వరరావు, మారయ్య మరియు గ్రామ మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

విశాఖపట్నం

సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వరుణ యాగం

*వరుణ యాగంలో పాల్గొనాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ఆహ్వాన పత్రికను అందజేసిన ఈవో గారు, చైర్మన్ గారు* రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజల సంక్షేమం, శ్రేయస్సు చేకూరాలని ఆకాంక్షిస్తూ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో వరుణ యాగం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి వరుణ యాగానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను శ్రీమతి శోభారాణి గారు, ఆలయ చైర్మన్ కందుల నాగరాజు గారు అందజేశారు. అక్టోబర్ 6, 2026 మంగళవారం ఉదయం 6:54 గంటలకు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో వరుణ యాగం ప్రారంభమవుతుందని వారు తెలిపారు. అమ్మవారి కృపతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొననున్నారు.

విశాఖపట్నం

జనసేన గూటికి పల్లా వెంకటరావు

*పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై జనసేనలో చేరిక* విశాఖపట్నం: భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీకి మరింత బలం చేకూరింది. భీమునిపట్నం మండలం టీ.నగరపాలెం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ *పల్లా వెంకటరావు* జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి జనసేనలో చేరినట్లు ఆయన తెలిపారు. జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా పల్లా వెంకటరావు పార్టీ కండువా కప్పుకున్నారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు శ్రీ పంచకర్ల సందీప్ గారి సమక్షంలో ఈ చేరిక జరిగింది. *సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత* పల్లా వెంకటరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీ.నగరపాలెం గ్రామ సర్పంచ్‌గా సేవలందించడంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్పంచ్‌ల సంఘం మాజీ కార్యదర్శిగా, జిల్లా యాదవ సంఘం ఉపాధ్యక్షులుగా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. స్థానికంగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన చేరికతో భీమిలి నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడుతుందని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పల్లా వెంకటరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని, భీమిలిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

73వ వార్డులో ఘనంగా పెన్షన్ల పంపిణీ

కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో తన నిబద్ధతను మరోసారి చాటుకుంది. ఒకటో తారీఖునే పేదల చేతికి పెన్షన్లు అందించాలనే లక్ష్యంతో నిన్న రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ చేశారు. గాజువాక నియోజకవర్గం 73వ వార్డులో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు మరియు విశాఖ జిల్లా కలెక్టర్ శ్రీ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ గారు చేతుల మీదుగా పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం వార్డు ప్రజలతో అభివృద్ధిపై చర్చా గోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ దయానిధి గారు, గాజువాక జోనల్ కమిషనర్ శేషాద్రి గారు, గాజువాక, పెద్దగంట్యాడ ఎమ్మార్వో గార్లు, ఇతర సిబ్బంది మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. *రౌతు గోవిందరావు* 73వ వార్డు జనసేన అధ్యక్షులు

విశాఖపట్నం

మింది ATM రోడ్డు ట్రాఫిక్ సమస్యపై స్పందించిన పోలీస్ కమిషనర్*

మింది ATM రోడ్డులో రోజురోజుకూ పెరుగుతున్న భారీ ట్రాఫిక్ సమస్యపై మాజీ కార్పొరేటర్ *గుడివాడ అనూష* గారు నిన్న విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేసి, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన పోలీస్ కమిషనర్ గారు ఈరోజు గాజువాక ట్రాఫిక్ పోలీసులను మింది ATM రోడ్డుకు పంపించి, అక్కడి ట్రాఫిక్ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం గాజువాక CI గారికి మరియు కమిషనర్ గారికి పరిస్థితిపై వివరాలు తెలియజేశారు. మింది ATM రోడ్డులో ట్రాఫిక్ పరిస్థితిని మరింతగా అధ్యయనం చేసేందుకు రానున్న కొన్ని రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులను అక్కడ విధుల్లో ఉంచి, వాహనాల రాకపోకలను పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే స్పందించి చర్యలు చేపట్టిన పోలీస్ కమిషనర్ గారికి, గాజువాక ట్రాఫిక్ పోలీసులకు మాజీ కార్పొరేటర్ గుడివాడ అనూష గారు కృతజ్ఞతలు తెలిపారు.

విశాఖపట్నం

తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించాము

గాజువాక నియోజకవర్గంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన గాజువాక నియోజకవర్గం, షీలానగర్, హరిజన జగ్గయ్యపాలెంలో తుపాను ప్రభావిత ప్రాంతాలను గాజువాక ఎమ్మెల్యే శ్రీనివాస్ రావు తో కలిసి పరిశీలించడం జరిగింది. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను పరామర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాము. – మాకా శాలిని 68వ వార్డు జనసేన ఇన్చార్జ్, *గాజువాక నియోజకవర్గం*

విశాఖపట్నం

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాతయ్యపాలెం కృష్ణమహంతి చెరువు పక్కన ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరింది

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాతయ్యపాలెం కృష్ణమహంతి చెరువు పక్కన ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరింది విషయాన్ని తెల్లవారుజామున 5 గంటలకే గమనించిన 69వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు సండ్రానా భాస్కర్ వెంటనే స్పందించారు. JCB సహాయంతో చెరువు గట్టుకు నాలుగు చోట్ల గండి కొట్టించి, ఇళ్లలోకి వచ్చిన వరద నీటిని తిరిగి చెరువులోకి మళ్లించారు. దీంతో ముంపు నుండి స్థానికులకు ఉపశమనం కలిగింది.

విశాఖపట్నం

ప్రధాని మోదీజీ జన్మదిన సేవా సంకల్ప ఉత్సవాలలో భాగంగా వడ్లపూడిలో ప్రత్యేక పూజలు.

వడ్లపూడి శ్రీ సీతారామలింగేశ్వర ఆలయంలోని పంచముఖ వినాయకుడికి 108 స్వీట్స్ తో సారె సమర్పణ. బీజేపీ జిల్లా నాయకులు బొండా యల్లాజీరావు, శ్రీదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం వినాయక రూపంలో దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించారు. మోదీజీ నిండు నూరేళ్లు జీవించాలని, భారత్ ను విశ్వగురువు చేయాలని పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి రాజకీయాలకతీతంగా మహిళలు, గ్రామ పెద్దలు, పిల్లలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బొండా యల్లాజీరావు మాట్లాడుతూ మోదీజీ 25 ఏళ్లుగా నీతివంతమైన పాలన అందిస్తున్నారని అన్నారు. ప్రపంచ నేతలే మోదీజీని తమ బాస్, మార్గదర్శకుడిగా భావిస్తున్నారని కొనియాడారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బొండా జగన్, ఈర్లి శ్రీరాములు, మింది రామారావు తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ నుండి మింది గోవింద, కర్రి కృష్ణ, మడక అప్పలరాజు పాల్గొన్నారు. మహిళా నాయకులు బొండా శ్రీదేవి, లక్ష్మి, సుజాత, మంగసత్య తదితరులు హాజరయ్యారు. భజన మండలి సభ్యులు కుమారి, పద్మ, షాలిని, విజయలక్ష్మి పాల్గొన్నారు.. అర్చకులు నరసింహమూర్తి, సత్యనారాయణలు మోదీజీ పేరున ప్రత్యేక పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో కార్యక్రమం ఘనంగా ముగిసింది.