संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
विशाखापट्टनम

విశాఖ ఉక్కు పరిరక్షణకు “ఉక్కు విలీన దీక్ష” – 100 గంటల దీక్ష ప్రారంభం

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
విశాఖ ఉక్కు పరిరక్షణకు “ఉక్కు విలీన దీక్ష” – 100 గంటల దీక్ష ప్రారంభం

खबर की मुख्य बातें

  • విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, RINL పరిరక్షణ కోసం స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ (SEA) ఆధ్వర్యంలో 100 గంటల "ఉక్కు విలీన దీక్ష" ప్రారంభమైంది.
  • *"TO KEEP THE STEEL SECTOR IN THE STRATEGIC SECTOR and MERGER OF SAIL, RINL, NSL & MECON"* అనే ప్రధాన డిమాండ్ తో ఈ దీక్ష చేపట్టారు.
  • *SEA భవన్ లో* అక్టోబర్ 2వ తేదీ ఉదయం 8 గంటల నుండి అక్టోబర్ 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు 100 గంటల పాటు ఈ దీక్ష కొనసాగనుంది.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, RINL పరిరక్షణ కోసం స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ (SEA) ఆధ్వర్యంలో 100 గంటల “ఉక్కు విలీన దీక్ష” ప్రారంభమైంది.

*”TO KEEP THE STEEL SECTOR IN THE STRATEGIC SECTOR and MERGER OF SAIL, RINL, NSL & MECON”* అనే ప్రధాన డిమాండ్ తో ఈ దీక్ష చేపట్టారు.

*SEA భవన్ లో* అక్టోబర్ 2వ తేదీ ఉదయం 8 గంటల నుండి అక్టోబర్ 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు 100 గంటల పాటు ఈ దీక్ష కొనసాగనుంది.

*ప్రధాన డిమాండ్లు:*
1. స్టీల్ రంగాన్ని వ్యూహాత్మక రంగంలోనే కొనసాగించాలి, SAIL, RINL, NSL & MECON లను విలీనం చేయాలి.
2. కోక్ ఓవెన్ బ్యాటరీలకు తక్షణమే రూ. 3,000 కోట్ల సహాయం అందించాలి.
3. వినియోగించే ప్రతి టన్ను ఇనుప ఖనిజంపై రూ. 3,000 సబ్సిడీ ఇవ్వాలి.
4. పెండింగ్ వేతనాలు, నేషనల్ ప్రమోషన్లు, 2020-21, 2021-22 PRP విడుదల, VRS చెల్లింపులు, అధిక పింఛన్ కోసం డిమాండ్ లెటర్ల పునఃజారీ, గ్రాట్యుటీని రూ. 25 లక్షలకు పెంచడం, రిటైరైన ఉద్యోగులకు పాత GMIS కొనసాగింపు.

ఈ దీక్షకు RINL ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి (డ్యూటీ సమయం తర్వాత) పాల్గొని మద్దతు తెలపాలని SEA నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో SEA ప్రతినిధులు, వివిధ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *