Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel

Tag: #టీటీడీ #తిరుమల #తిరుపతి #ముద్దాడరవిచంద్ర #టీటీడీవార్తలు #ఆంధ్రప్రదేశ్ #పున్నమిన్యూస్ #TTD #Tirumala #Tirupati #TTDNews #MuddadaRavichandra #AndhraPradesh #PunnamiNews

అమరావతి

టీటీడీ పాలనకు రవిచంద్ర సారథ్యం!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించింది. సోమవారం జీవో ఎంఎస్‌ నంబర్‌ 658 జారీ చేసింది. దేవాదాయ చట్టం-1987లోని సెక్షన్‌ 137 ప్రకారం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రను ప్రత్యేక అధికారుల బృందం ఛైర్మన్‌గా నియమించింది. సభ్యులుగా ఆర్థిక శాఖ కార్యదర్శి వి.వినయ్‌ చంద్‌, దేవాదాయ శాఖ కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) కె.కన్నబాబును నియమించింది. ఈ బృందం పాలకమండలి అధికారాలు, విధులను నిర్వహించనుంది. కొత్త పాలకమండలి ఏర్పడే వరకు లేదా గరిష్ఠంగా ఏడాది పాటు ఈ బృందం కొనసాగనుంది. ఈ రెండింటిలో ఏది ముందుగా జరిగితే అప్పటితో బృందం పదవీకాలం ముగుస్తుంది.