Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Amaravati

టీటీడీ పాలనకు రవిచంద్ర సారథ్యం!

Punnami Newsroom Published:
టీటీడీ పాలనకు రవిచంద్ర సారథ్యం!

Story highlights

  • తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించింది.
  • సోమవారం జీవో ఎంఎస్‌ నంబర్‌ 658 జారీ చేసింది.
  • దేవాదాయ చట్టం-1987లోని సెక్షన్‌ 137 ప్రకారం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రను ప్రత్యేక అధికారుల బృందం ఛైర్మన్‌గా నియమించింది.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించింది. సోమవారం జీవో ఎంఎస్‌ నంబర్‌ 658 జారీ చేసింది. దేవాదాయ చట్టం-1987లోని సెక్షన్‌ 137 ప్రకారం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రను ప్రత్యేక అధికారుల బృందం ఛైర్మన్‌గా నియమించింది. సభ్యులుగా ఆర్థిక శాఖ కార్యదర్శి వి.వినయ్‌ చంద్‌, దేవాదాయ శాఖ కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) కె.కన్నబాబును నియమించింది. ఈ బృందం పాలకమండలి అధికారాలు, విధులను నిర్వహించనుంది. కొత్త పాలకమండలి ఏర్పడే వరకు లేదా గరిష్ఠంగా ఏడాది పాటు ఈ బృందం కొనసాగనుంది. ఈ రెండింటిలో ఏది ముందుగా జరిగితే అప్పటితో బృందం పదవీకాలం ముగుస్తుంది.

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *