నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ ఎంపికలు ముగింపు
నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ ఎంపికలు ముగింపు ————————————————————- స్థానిక మినీ స్టేడియం ధర్మకంచ జనగామలో 14 మరియు 16 సంవత్సరాల బాలబాలికల నేషనల్ ఇంటర్ డిస్టిక్ జూనియర్ అథ్లెటిక్స్ (NIDJAM) సెలక్షన్స్ జరిగినవి, ఈ ఎంపీకలలో జిల్లా నలుమూల నుండి దాదాపు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు, ఈ ఎంపికల్లో ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెలలో వోక్సన్ యూనివర్సిటీ, కామ్కోల్, సంగారెడ్డిలో జరిగే జాతీయస్థాయి నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో పాల్గొంటారు. ప్రారంభ సమావేశానికి శ్రీ పెద్ద వెంకట నారాయణ గౌడ్ గారు 18 వార్డ్ కౌన్సిలర్ గోపగోని సుగుణాకర్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ హరికృష్ణ గారు పాల్గొన్నారు శ్రీ వెంకట్ నారాయణ గౌడ్ గారు మాట్లాడుతూ ఎంపికైన క్రీడాకారులు అందరికీ ట్రాక్స్ తో పాటు రానుగొను ప్రయాణ కర్చులు కూడా ఏర్పాటు చేస్తానని తెలియజేశారు. కౌన్సిలర్ శ్రీ గోపగోని సుగుణాకర్ గారు మాట్లాడుతూ అథ్లెటిక్స్ కు సంబంధించిన రాష్ట్ర స్థాయి క్రీడలను ఏర్పాటు చేస్తే తన వంతు ఆర్థిక హార్దిక సహాయ సహకారాలు పూర్తిగా అందజేస్తానని తెలియజేశారు, శ్రీ హరికృష్ణ స్థానిక యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారు మాట్లాడుతూ క్రీడలకు కావలసిన ఏవైనా సౌకర్యాలు అవసరం ఉంటే తనను కలవాల్సిందిగా కోరారు, ముగింపు సమావేశంలో తెలంగాణ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ కొదురుపాక సారంగపాణి గారు మాట్లాడుతూ మంచి క్రమశిక్షణ గల క్రీడాకారులను జనగామ జిల్లా తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ కు అందిస్తుందని క్రీడాకారులు క్రీడల్లో క్రమశిక్షణతో పాల్గొని భవిష్యత్తులో క్రీడాకోటాలో మంచి ఉద్యోగాలు పొందాలని తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని తెలియజేశారు మరియు గెలుపొందిన క్రీడాకారులకు బహుమతి ప్రధానము చేశారు, ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి మనోజ్ కుమార్, కోశాధికారి ఆవుల అశోక్, నిర్వహణ కార్యదర్శి వంచ చంద్రశేఖర్ రెడ్డి, పాఠశాల 19 సంవత్సరాల క్రీడా కార్యదర్శి అజ్మీర కిషన్, పాఠశాల జనగామ జిల్లా కార్యదర్శి శ్రీ జాటోతు గోర్సింగ్, పదవి విరమణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘము జనగామ జిల్లా అధ్యక్షులు శ్రీ గుడ్ల కిష్టయ్య గారు, అథ్లెటిక్స్ అసోసియేషన్ కోచ్ రంజిత్ కుమార్, అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు కిరణ్, శ్రీదేవి, సురేష్, రవీంద్ర ప్రసాద్, దేవ్ సింగ్, రాజు, అన్వేష్, వ్యాయామ దర్శకులు లచ్చిరాం, కిషన్, కిరణ్, దేవ్ సింగ్, సుధారాణి, మహేష్, ఉష తదితరులు పాల్గొన్నారు.





